గుండు తో గాయపడిన నా మనసు - Part 2
నేను ఆశ్చర్యంలో నుంచి తేరుకుని నోరు తెరిచి సరోజినీ అని పిలిచే లోపల మంగలి వాడు సరోజినీ జుట్టుని రెండు ముడులు వేసి మంగలి కత్తిని తీసుకుని సరోజినీ తలపై పెట్టి గీకడం మొదలు పెట్టేసాడు.
నేను చప్పుడు చేయకుండా వాళ్ల దగ్గరికి వెళ్ళేసరికి సరోజినీ తల వెనుక భాగం మొత్తం గీకేసి వుంది.
అలా గీకేసిన జుట్టంతా తన ముందు వైపుకి పడి మొహం కనిపించకుండా పోయింది. నేను నిశ్చేష్టుడై నిలబడి చూస్తుంటే మంగలి వాడు సరోజినీ తలని ముందువైపు పైకెత్తుతూ జుట్టు మొత్తాన్ని ముందు వైపుకి గీకుతూ ఉంటే ఆ జుట్టు మొత్తం దభీమని సరోజినీ ఒడిలో పడిపోయింది.
నేను ఒక చప్పుడు చేయకుండా గుండె రాయి చేసుకుని అడుగులో అడుగు వేసుకుని వెనక్కి వచ్చేసి టెంపుల్ లో ఒక మూల దాగి నిలబడి చూస్తూ ఉన్నాను.
ఒక అయిదు నిమిషాలలో గుండు ని తడుముకుంటూ సరోజిని బయటికి వచ్చింది. గుండులో ఉన్న సరోజిని ని చూసి నేను నమ్మలేక పోయాను. సరోజినీ వెనకాతలే మంగలి వాడు బయటకి వెళ్ళిపోయాడు.
అటు ఇటు చూసుకుంటూ సరోజినీ దర్శనం చేసుకుని గుడి బయటకు వెళ్ళిపోయింది.
నేను ఎవరూ చూడకుండా మళ్ళీ షెడ్ లోకి వెళ్ళాను. సరోజినీ కూర్చున్న చోటనే పక్కన సరోజినీ జుట్టు రెండు ముడులు పడేసి ఉన్నాయి. నేను వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ రెండు జుట్టు ముడులు అటూ ఇటూ చూసి ఎవరూ చూడకుండా తీసుకుని నా షర్టు లోపల దాచి పెట్టి అటూ ఇటూ చూసి ఎవరూ లేరని గమనించి నెమ్మదిగా బయటకు వచ్చి ఇంటికి వచ్చేసాను.
ఇంట్లో ఎవరూ చూడకుండా నేను నా రూం లోకి వెళ్లి పోయి తలుపు వేసుకున్నాను. వెంటనే నా చొక్కా లోపల దాచిన సరోజినీ రెండు జుట్టు ముడులను బయటకు తీసి మంచం మీద పెట్టి తడిసిన జుట్టుతో తడిసిపోయిన నా చొక్కా ని విప్పేసి ఒక పక్కన పడేసాను. నెమ్మదిగా మంచం మీద కూర్చుని రెండు జుట్టు ముడులను నీటుగా సర్ది రెండు జుట్టు ముడుల మొదట్లో రెండు రబ్బర్ బ్యాండ్లు పెట్టి మంచం మీద పరిచాను.
అంత అందమైన పొడుగాటి నల్లటి జుట్టు నిర్జీవంగా పడి ఉండటాన్ని చూసి నాలో దుఃఖం పొంగి పొరలి పోయింది. ఎంత అందంగా ఉందో ఆ జుట్టు... అలాంటి జుట్టు మీద దయ లేకుండా గుండు గీయించేసుకుంది సరోజిని.
జుట్టుని మధ్యమధ్యలో సవరదీస్తూ ఫ్యాను గాలికి ఆరబెట్టాను. ఆ తడిసిన జుట్టు ఫ్యాను గాలికి ఆరుతూ నల్లగా నిగనిగలాడుతూ మంచి షైనింగ్ తో మెరుస్తున్నాయి. ఆ రెండు జుట్టు కొనలను కలిపి ఒకటిగా చేసి చివర ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టాను. ఆ తర్వాత ఆ జుట్టు ని నెమ్మదిగా సరోజినీ అల్లుకునే విధంగా జడ గా అల్లి రెండు మూడు మడతలు పెట్టి ఒక పెద్ద కవర్ లో పెట్టాను. నేను మంచం మీద పడుకుని ఆ కవర్ ని నా పొట్ట పైకి పెట్టుకొని సరోజిని నేను కలిసి ఉన్న మధుర క్షణాలను గుర్తుతెచ్చుకుంటూ గతంలో కి వెళ్ళిపోయాను.
గతంలో నేను సరోజినీ ఇంటికి వెళ్ళినప్పుడు సరోజినీ ఎక్కడికో బయలుదేరుతూ ఉంది.
'ఎక్కడికి అండి?' అని అడిగితే "బ్యూటీ పార్లర్ కి అండి తోడు వస్తారా?" అని అడిగింది.
నేను లోలోపల ఎగిరి గంతేసి 'అలాగేనండి పదండి నాకు ఏమీ తోచడం లేదు' అంటూ సరోజినీ తో పాటు బ్యూటీ పార్లర్ కి వెళ్లాను.
అక్కడ తను తన కనుబొమ్మలను షేప్ చేయించుకొని తన జుట్టు కి హెయిర్ స్పా చేయించుకుంది. అప్పుడు ఆ బ్యూటీషియన్ 'మంచి హెయిర్ కట్ చేస్తానండి మీకు చాలా బావుంటుంది. ఎంతకాలం ఇలా జడ వేసుకుని ఉంటారు?' అని అడగగానే
"లేదండీ నాకు ఇలాంటి జడ ఇష్టం. నేను జుట్టుని కత్తిరించుకోవడం ఇష్టం ఉండదు" అంటూ రిజెక్ట్ చేసింది.
ఇద్దరం సరోజినీ ఇంటికి రాగానే నేను కొంచెం చొరవ తీసుకుని 'ఏంటి సరోజిని గారు ఆవిడ చెప్పినట్లు హెయిర్ కట్ చేయించుకోవచ్చు కదా' అని అడిగాను.
"లేదండి నాకెందుకో జుట్టుని కత్తిరించుకోవడం అంటే ఇష్టం ఉండదు. అందుకే నాకు ఊహ తెలిసిన దగ్గరనుండి నా జుట్టు మీద కత్తెరను పెట్టనివ్వలేదు" అంటూ వేసుకున్న జడ ని ముందుకు వేసుకుని చూసుకుంటూ అంది.
'అలాగా' అని నేను కొంచెం నీరసంగా అనేసరికి
"ఏమిటండీ నాకు జడ బాగాలేదా? జడలో నేను అందంగా లేనా? అంటూ లేచి నా దగ్గరకు వచ్చి వెనక్కి వేసుకుని అటు వైపు తిరిగి నాకు జడ చూపిస్తూ "ఇప్పుడు నా జడని దగ్గరగా చూసి చెప్పండి అందంగా ఉందా లేదా?"
సరోజినీ జడని అంత దగ్గరగా చూడటం అదే మొదటిసారి కావడంతో చాలా టెన్షన్ ఫీలయ్యాను. నేను తన నడుము కింద నుండి పై వరకూ చూస్తూ వణుకుతున్న చేతులతో సరోజినీ జడని మొదటి నుండి చివరి వరకు అంటీ అంటనట్టు గా స్పృశించాను. టచ్ చేసిన ఫీలింగ్ ఇప్పటికే మరిచిపోలేదు.
అప్పుడు తను నా వైపుకి తిరిగి "ఇప్పుడు చెప్పండి నా జడ అందంగా ఉందా లేదా? అందమైన జడని కత్తిరించమంటారా చెప్పండి?"
"అవునండి మీరు చెప్పినట్టే మీ జడ చాలా అందంగా ఉంది అలాంటి జడని కత్తిరించుకొని పాడుచేసుకోవద్దు."
నేను ఇంకొకసారి సరోజినీ ఇంటికి వెళ్ళినప్పుడు సరోజినీ యధావిధిగా వదులుగా జడ వేసుకుని ఉంది కానీ జడలో గులాబీ పెట్టలేదు.
నేను వెంటనే గమనించి "ఏంటి సరోజినీ జడలో గులాబీని పెట్టలేదు" అని అడిగాను.
"నిన్న గులాబీలు తెచ్చుకోవడం మర్చిపోయా అండి అందుకునే పెట్టుకోలేదు. ఏమి గులాబీ లేని నా జడ బాగాలేదా?" అని నవ్వుతూ అడిగింది.
'అవునండి బాగాలేదు ఏదోలా వుంది. జడ బోసి పోయినట్టు ఉంది. ఉండండి ఇప్పుడే వెళ్ళి తెస్తాను" అని బయలుదేరుతుండగా
'ఇప్పుడు ఎందుకండి వదిలేయండి రేపు నేను తెచ్చుకుంటా లే'
"పర్వాలేదండి ఉండండి ఒక అయిదు నిమిషాల్లో వచ్చేస్తాను అని బయటకు వెళ్ళి చూస్తే గులాబీలు దొరకలేదు అందుకని నాలుగు మూరలు మల్లె పూలు తెచ్చాను. వాటిని ఇస్తుంటే
"ఎంతో ప్రేమతో తెచ్చారు కదా మీరే పెట్టండి ఏమీ అనుకోకుండా" వెనక్కి తిరిగి జడని నాకు అప్పజెప్పింది.
నేను మల్లెపూలను సరోజినీ జడలో తురిమి
"ఇప్పుడు చూడండి మీ జడకే అందం వచ్చింది" అని మెచ్చుకున్నాను.
నేను పూలను తన జడలో తురుముతు ఉంటే తను కొంచెం సిగ్గు పడినట్టు అనిపించింది. పైగా నేను తన జడను లైక్ చేస్తున్నానని గమనించినట్టు కూడా ఉంది.
నేను అప్పుడప్పుడు మాటల మధ్యలో తన జుట్టు ప్రస్తావన తీసుకు వస్తూ మాట్లాడటం మొదలు పెట్టాను.
"ఏమండీ సరోజిని గారు ఏంటి ఎప్పుడు మీరు జడ వేసుకునే కనిపిస్తారు ఇంక వేరే స్టైల్ను వేసుకో రా ?"అని అడిగాను.
'లేదండీ నాది పొడుగాటి జుట్టు కదా! విరబోసుకొంటె బాగుండదు. అందుకని ఎప్పుడూ జడ వేసుకుంటాను లేదా ముడి పెట్టుకుని ఉంటాను".
"ఏది ఏమైనా మీరు గ్రేట్ అండి సరోజిని గారు"
'ఎందుకండీ అలా అంటున్నారు ఎందుకు నేను గ్రేట్?'
"ఈ రోజుల్లో స్టూడెంట్స్ అందరూ పొడుగాటి జుట్టు ని మెయింటైన్ చెయ్యలేక అందం అన్న పేరుతో జుట్టు నంతటిని కత్తిరించేసుకుంటున్నారు. అలాంటిది మీరు అసలు జుట్టు కత్తిరించు కోకుండా ఇంకా పొడుగు జుట్టు నే మెయింటైన్ చేస్తున్నారు అందుకనే మీరు చాలా గ్రేట్".
దాంతో సరోజినీ మెలికలు తిరుగుతూ సిగ్గుతో "నిజమా అండి!" అంటూ నవ్వింది.
ఇలా మా మధ్య చనువు కొంచెం పెరిగింది.
ఒక రోజు నేను ఇంటికి వెళ్ళేటప్పటికి తను తల స్నానం చేసి బయటకు వచ్చి హెయిర్ డ్రయ్యర్ ని నాకు ఇచ్చి "ఏమీ అనుకోకుండా నా జుట్టుని ఆరబెడతారా?" అని అడిగింది.
ఏమి నా భాగ్యం అనుకుంటూ సరోజినీ తలకు చుట్టుకున్న టవల్ ని తీసి జుట్టుని విరబోసి నెమ్మది నెమ్మదిగా ఒక చేత్తో తన జుట్టుని పైకి ఎత్తుతూ ఒక చేత్తో హెయిర్ డ్రయ్యర్ తో ఆమె తడి జుట్టును ఆరబెట్టడం మొదలుపెట్టాను.
నిజానికి తన జుట్టుని పట్టుకున్నప్పుడు నాకు వదల బుద్ధి కాలేదు అంత మెత్తగా ఉంది సరోజినీ జుట్టు.
'పని లో పని నా జుట్టు చిక్కులు తీసి జడ వేస్తారా?' అంటూ నవ్వింది
'అలాగే మేడమ్ మీరు ఎలా అంటే అలా చేస్తా' అంటూ దువ్వెన అందుకుని ఆమె జుత్తు ని చక్కగా దువ్వి జడ వేయడం మొదలు పెట్టాను.
నేను జడ వేయడాన్ని చూసి 'బానే వేస్తున్నారే జడని. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది' అని అడిగింది.
"ఇందులో ఏముందండి జుట్టుని మూడు భాగాలుగా తీసి పాయలుగా అల్లడం అంతే కదా నేను ఎప్పుడో టీవీలో చూశాను జడ తలపై నుండి వేయడం".
అందుకని నేను సరోజినీ జుట్టు తల పైభాగం నుంచి వేయడం మొదలు పెట్టాను.
దాంతో పాయల జడ బాగా వచ్చింది. వేసిన జడ సరోజినీ కి బాగా నచ్చింది.
"చాలా బాగా వేశారు అండి నేనెప్పుడూ ఇలాంటి జడను ట్రై చేయలేదు" అంటూ మెచ్చుకుంది 'చాలా థ్యాంక్స్ అండీ' అన్నాను.
ఇద్దరం కలిసి భోజనం చేసి బోరుకొడుతుంటే సినిమాకి వెళ్దామా అని అనుకున్నాం. సరే అని ఒక సినిమా థియేటర్ కు వెళ్లి లోపలికి వెళ్లి కూర్చున్నాము.
నేను సరోజినీ కి ఎడమ పక్క కూర్చున్నాను. ఆల్మోస్ట్ థియేటర్ అంతా ఖాళీగా ఉంది. థియేటర్లోకి వెళ్లేటప్పుడు సరోజినీ తన జడ ని కుడివైపు వేసుకుని ఉంది.
థియేటర్ లోపలికి వెళ్ళి కూర్చోగానే తను కావాలని తన జడని ఎడమవైపుకి వేసుకొని జడ చివర్లో నా ఒడిలో పడేటట్టు వేసింది.
ఇంక నా రెండు చేతులు తన జడ చివర్లో పట్టుకునే ఉన్నాయి.
నేను తన జుట్టుని పట్టుకుని ఆనందిస్తున్నానని తనకి తెలిసింది.
నేను తన జుట్టుని పట్టుకున్నాను అని గమనించినట్టు సరోజినీ కి తెలియగానే నేను తన జుట్టు మీద నుండి నా చేతిని తీసి వేసాను. నేను చేతిని తన జుట్టు మీద నుండి తీసి వేయగానే తను తన తలని నా ఎద పై వాల్చింది.
అప్పుడు తన జుట్టు తో నా మొహాన్ని రుద్దుతున్న టు చేసింది. ఆ జుట్టు నుండి వచ్చే కమ్మని షాంపు వాసన నన్ను కట్టిపడేసింది. ఇంక ఆపుకోవడం నా వల్ల కాక నా చేతిని తీసి ఆమె తల పై వేసాను.
హాలులో ఉన్న రెండు గంటలు నా దృష్టంతా ఆమె జుట్టు మీదే ఉంది.
ఇంతలో నా రూమ్ తలుపు ఎవరో కొట్టిన శబ్దం అవడంతో నేను ఈ లోకం లోకి వచ్చాను.
వెళ్లి తలుపు తీసి చూస్తే అమ్మ 'ఎన్నిసార్లు పిలిచినా పలకవు ఏం చేస్తున్నావ్? భోజనం పెట్టాను వచ్చి చెయ్యి'
'అలాగే అమ్మ ఏదో నిద్ర పట్టేసింది అంతే' అని వెళ్లి భోజనం చేసి మరలా రూం లోకి వచ్చి తలుపు వేసుకుని మంచం మీద పడుకొని కవరులో నుండి తన జుట్టుని తీసి మరలా ఒకసారి చూసుకొని తడిమి తడిమి మరలా కవర్లో పెట్టి పడుకొని ఆలోచించసాగాను.
ఇంత అందమైన జుట్టు ని ఎందుకు గుండు చేయించుకుంది? ఇంకా అర్థం కావటం లేదు. అసలే పెళ్లి కావలసిన అమ్మాయి ఈ టైములో అంత పొడుగు జుట్టు ని ఎందుకు గుండు చేయించుకుంది?
నాతో అంత క్లోజ్ గా ఉంది కదా కనీసం నాకు కూడా చెప్పలేదు. అని రోజంతా అలా ఆలోచిస్తూనే ఉన్నాను.
అలా రెండు రోజులు గడిచాయి. పోనీ తన ఇంటికి వెళ్దాం అంటే నాకు ధైర్యం చాలటం లేదు.
సరే అని ఒక రోజు ధైర్యం చేసి సరోజిని ఇంటికి వెళ్లాను.
కాలింగ్ బెల్ కొట్టగానే తను వచ్చి తలుపు తీసింది.
తలకి ఖర్చీఫ్ కట్టుకొని ఉంది. నన్ను చూసి కొంచెం సిగ్గు పడి తల దించుకొని 'రండి లోపలికి' అంది.
నేను ఏమీ తెలియని వాడిలా గా మొహం పెట్టి "ఏంటి సరోజిని గారు? ఏమిటీ అవతారం? ఏమైంది మీకు?" అని అడుగుతూ లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చున్నాను.
'ఏమీ లేదండి చిన్న మెుక్కు ఉంది అందుకని వెళ్లి గుండు చేయించుకుని వచ్చాను అంతే'
"ఏంటండీ అంత సింపుల్ గా చెప్తున్నారు మీరు అసలే పొడుగాటి జడ కదా! కనీసం ఇంతవరకు కత్తెర ని కూడా పెట్టనివ్వలేదు జుట్టుమీద అని మీరే చెప్పారు కదా! అలాంటిది ఏకంగా మంగలి కత్తిని తలమీద పెట్టించుకుని గుండు చేయించేసుకున్నారు.?"
నేను అలా అనేసరికి తన కళ్ళవెంట బొటబొటా మని నీళ్ళు కారాయి.
'అవునండీ మీరన్నట్టు నాకు నా జుట్టు అంటే చాలా ఇష్టం '
"మరి అలాంటిది ఎందుకు గుండు చేయించుకున్నారు? ఎవరి కోసం మొక్కుకున్నారు? ఒకవేళ మొక్కుకున్నా గుండు చేయించుకుంటా అని ఎందుకు మొక్కుకున్నారు? కత్తెర్లు ఇస్తానని మొక్కుకోవచ్చు కదా? ఏకంగా జుట్టు మొత్తాన్ని ఇచ్చేస్తానని ఎందుకు మొక్కుకున్నారు?" అని అడిగాను.
అప్పుడు తను తలకి కట్టుకున్న కర్చీఫ్ ని తీసి పక్కన పడేసి కళ్ళ వెంట వస్తున్న నీళ్ళని తుడుచుకుని లేచి వచ్చి నా పక్కన కూర్చుని గద్గద స్వరంతో
'నేను మా ఇంట్లో మా అమ్మానాన్నలకి ఒక్కదాన్నే నండి. అందువల్ల నేను కొంచెం రిజర్వు గా పెరిగాను. నేను ఇక్కడికి రాకముందు చదివే కాలేజీలో నాకు ఒకే ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అతను కూడా మీలాగే నాకు బాగా క్లోజ్ అయ్యాడు. నాకంటే పెద్ద అనుకోండి.
అతను నన్ను చాలా ప్రేమగా చూసుకునేవాడు. అలాంటి అతనికి మొన్న ఒక యాక్సిడెంట్ అయింది. ఆల్మోస్ట్ ఆల్ చావు అంచుల వరకు వెళ్ళాడు. డాక్టర్ అయితే ఇంక బతకడం కష్టం అని చెప్పేసారు కూడా. ఆ విషయం తెలిసిన నేను వెంటనే నా జుట్టు ఇచ్చేస్తానని మొక్కుకున్నాను. నేను మొక్కుకున్న నెక్స్ట్ డే ఏదో వింత జరిగినట్టు అతను నెమ్మది నెమ్మదిగా కోలుకుని ఒక వారం రోజుల క్రితం డిశ్చార్జ్ అయ్యాడు. మీరు నన్ను టెంపుల్ దగ్గర డ్రాప్ చేయమని అడిగాను కదా ఆ రోజు. అందుకనే నేను మొక్కు తీర్చుకుందామని మిమ్మల్ని టెంపుల్ దగ్గర డ్రాప్ చేయమన్నాను. మీకు నా జుట్టు అంటే బాగా ఇష్టం కదా అందుకని మీకు చెప్పలేదు.చెబితే మీరు ఎక్కడ బాధ బాధపడతారో అని చెప్పలేదు. అందుకే ఆ రోజు మిమ్మల్ని నాతో పాటు టెంపుల్ లోపలికి రమ్మని కూడా అనలేదు. నా అందమైన జుట్టు ని గుండు చేయించుకుంటే మీరు పడే బాధని నేను భరించలేను. అందుకని పిలవలేదు చెప్పలేదు కూడా."
"సరోజిని గారు మీరు ఇప్పుడు నిజంగా గ్రేట్ అండి. అతను కనీసం మీ తోడబుట్టిన అతను కూడా కాదు అలాంటి ఫ్రెండ్ గురించి మీరు అంత అందమైన పొడుగాటి ఒత్తైన జుట్టు ని గుండు చేయించుకుని త్యాగం చేశారు. ఎవరి చేస్తారండి ఇలాగా?" అని నేను అంటుంటే
తను ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంటే తన గుండు పై చేయి వేసి నిమిరాను.
'మరి ఈ విషయం మీ ఇంట్లో చెప్పారా అండి?'
"లేదండి వాళ్ళకు ఇంకా చెప్పలేదు. చెబితే ఏమంటారో అని భయంగా ఉంది'.
"అవునండి నిజమే ఎందుకంటే పెళ్లి కావలసిన అమ్మాయి. అలాంటిది ఏకంగా వెళ్లి గుండు చేయించుకుంటే ఎలా పెళ్లి అవుతుంది అని ఆలోచిస్తారు తల్లిదండ్రులు'.
"మీరు చెప్పేది నిజమే నండి నేను ఆ యాంగిల్లో ఆలోచించలేదు".
'పోనీలెండి అయిందేదో అయిపోయింది. ఇంక ఇప్పుడు చేసేదేమీ లేదు కదా?'
"అవునండి ఎలాగూ చేయించేసుకున్నాను కదా జుట్టు పెరగడానికి కనీసం మూడు నాలుగు సంవత్సరాలు పడుతుంది. ఏదో ఒక రకంగా మేనేజ్ చేయాలి."
సరోజినీ చెబుతున్న మాటలకి నా కళ్ల వెంట నీళ్లు వచ్చేసాయి.
'చూసారా మీరు కూడా బాధ పడుతున్నారు అందుకే ఆ రోజు మీకు చెప్పలేదు' అంటూ ఏడ్చింది.
ఆమెను ఓదారుస్తూ 'సరోజినీ గారు నేను ఒక మాట చెప్తాను ఏమీ అనుకోరు కదా?'
"చెప్పండి పర్వాలేదు. ఏమీ అనుకోను".
'ఎలాగూ నాకు డిగ్రీ అయిపోయింది కదా ఇంకొక మూడు సంవత్సరాలు నాకు టైం ఇవ్వండి. మూడు సంవత్సరాలలో నేను ఒక మంచి జాబు ని సంపాదించుకుంటాను. ఆ తర్వాత నీకు అభ్యంతరం లేకపోతే మనం పెళ్లి చేసుకుందాం. ఏమంటారు?'
" అలాగేనండి తప్పకుండా నాకేమీ అభ్యంతరం లేదు నేను మా వాళ్లకు కూడా చెబుతాను చెబితే వాళ్ళు కాదనరు."
" మీకు నా అందమైన జుట్టు అంటే చాలా ఇష్టం కదా అలాంటి జుట్టు ఇప్పుడు నాకు లేదు కదా మరి ఎలా పెళ్లి చేసుకుంటారు నన్ను?"
'సరోజిని గారు మీరు చెప్పింది నిజమే. నేను మీకంటే మీ జుట్టుని బాగా ప్రేమించాను.మీ జుట్టు అంటే నాకు చాలా బాగా ఇష్టం. పోతే పోయింది జుట్టు మీ జుట్టు మళ్లీ పెరగదా ఏంటి ? అయినా మీరు ఎప్పుడూ గుండులోనే ఉండరు కదా! జుట్టు పెరుగుతుంది కదా! మనం పెళ్లి చేసుకునే నాటికి కొంచమైనా పెరగకుండా ఉండదు కదా.?'
నేను తనకి అలా మాట ఇచ్చాను పెళ్లి చేసుకుంటానని కానీ నాకు కొంచెం భయంగానే ఉంది ఇంట్లో ఏమంటారో అని.
ఒక వారం రోజులు అయింది నేను సరోజినీ ఇంటికి వెళ్లి. ఇదివరకైతే ఎప్పుడెప్పుడు వెళ్దామా సరోజినీ జుట్టు చూద్దామా అని అనిపించేది.
ఇప్పుడు ఆ జుట్టు లేదు కదా అందుకని అంత వెళ్లాలని అనిపించలేదు. ఇంట్లోనే కూర్చుని కష్టపడుతూ ఉన్నాను కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి.
ఒకరోజు తనే కాల్ చేసి "ఏంటండీ రావడం లేదు ఇంటికి?" అని అడిగింది.
"లేదండి కొంచెం బిజీగా ఉన్నాను. ఈరోజు వస్తాను" అని చెప్పి వెంటనే సరోజినీ ఇంటికి వెళ్ళాను. నన్ను చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తన గుండు ఇంకా నల్ల పడలేదు. ఇంకా మిలమిల మంటూ మెరుస్తూనే ఉంది. నేను తన గుండు ని చూస్తూ ఎప్పుడు తనకు జుట్టు పెరగాలో ఎప్పుడు నేను ఎంజాయ్ చెయ్యాలో అని ఆలోచిస్తూ ఉండగా
తనే "ఏంటండీ అంత దీర్ఘాలోచనలో మునిగి పోయారు" అని అడిగింది.
నేను తన గుండు ని చూస్తూనే 'ఏమీ లేదండి ఏమీ లేదు' అని అన్నాను.
నేను తన గుండు నే అబ్జర్వ్ చేస్తున్నానని గమనించింది.
"నేను ఇంకా మీరు నా జుట్టు గురించి, నా పొడుగాటి జడ గురించే ఆలోచిస్తున్నట్టు ఉన్నారు కదా? నిజమే కదా?" అంది.
ఇంక నేను అబద్ధం చెప్పడం ఇష్టం లేక 'అవునండి, నిజంగానే మీ పొడుగాటి జడ పొడుగు జుట్టు గురించే ఆలోచిస్తున్నాను' అని చెప్పేసాను.
" ఇంకా ఎందుకండీ ఆలోచన అయిందేదో అయిపోయింది ఇప్పుడు నాకు మీరు ఆలోచించినా నా జుట్టు నాకు రాదు కదా! అది పెరగాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది"
అంటూ నన్ను డైవర్ట్ చెయ్యడానికి "ఇంతకీ మీ ప్రిపరేషన్ ఎలా ఉంది?" అని అడిగింది.
'చాలా కష్టపడుతున్నానండి వచ్చేస్తుందేమో లెండి త్వరలో జాబ్'
" అయితే త్వరలోనే పెళ్లి చేసుకోవచ్చు అన్నమాట" అని ఆశగా అడిగింది.
' ఇప్పుడు జాబ్ కి వచ్చినా మనం మూడు నాలుగు సంవత్సరాలు ఆగుదాం అండి'.
" ఎందుకండీ అలాగా ?" అని అడిగింది.
' అదీ.. అదీ...' అని నేను నానుస్తుంటే
"నాకు జుట్టు లేదు అనే కదా మీ బాధ..నిజమే కదా?"
" అది కాదండీ" అని నేను స్లోగా అనేసరికి
'లేదండి నాకు అదే అనిపిస్తుంది నాకు జుట్టు లేదు కదా అందుకే మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఆగుదామని అంటున్నారు అప్పటికి కొంచెం పెరుగుతుంది కదా అని ఆశ. కదా?" అని అడిగింది.
"అవునండి. అది నిజమే".
' అంటే మీరు నా జుట్టు ని గురించి పెళ్లి చేసుకుంటున్నారా ?'
"మనం పెళ్లి చేసుకుంటున్నాం అనుకోండి అప్పుడు ఫోటోలు వీడియోలు తీస్తారు కదా! అందులో మీరు గుండుతో ఉంటే బాగుండదు కదా అందుకనే మూడు నాలుగు సంవత్సరాలు అని అంటున్నాను".
'3, 4 సంవత్సరాల కైనా నాకు ఇదివరకు ఉండేటటువంటి పొడుగాటి జడ రాదు కదా?'
" అది నిజమే అనుకోండి కొంచెం జుట్టు ఉంటే సవరమైనా పెట్టుకోవచ్చు కదా లేదా విగ్ అయినా పెట్టుకోవచ్చు కదా?"
' అది నిజమే నండి విగ్గు పెట్టుకోవడానికి కొంచెం జుట్టు పెరగడం ఎందుకు ఇప్పుడే పెట్టుకోవచ్చు కదా'
" మీరు చెప్పేది కరెక్టే నాకు ఆలోచన రాలేదు ముందు నాకు జాబు రానివ్వండి అప్పుడు ఆలోచిద్దాం నేను మిమ్మల్ని పెళ్ళి చేసుకోవడం మాత్రం ఖాయం"
'ఆ మాత్రం ధైర్యం ఇస్తున్నారు అది చాలా అండి నాకు' అని చాలా సంతోషించింది.
అలా కొంచెంసేపు ముచ్చట్లు చెప్పి నేను టాపిక్ ని మరల జుట్టు వైపు తీసుకు వచ్చాను.
' మీరు ఏమీ అనుకోనంటే నేను ఒకటి అడగనా నాకు తెలుసుకోవాలని చాలా ఆత్రంగా ఉంది'.
"అడగండి ఏమీ పర్వాలేదు" అని అంది.
" మీరు గుండు చేయించుకోవడానికి మంగలి వాడి దగ్గరికి వెళ్లారు కదా"
' అవును'
" అక్కడ ఏమి జరిగిందో? మీ ఫీలింగ్స్ ఏమిటో? మీరు ఎలా ఫీలయ్యారు కొంచెం వివరంగా చెప్పరా ప్లీజ్ "అని అడిగాడు.
'నాకు సిగ్గేస్తుంది అండి.'
"ఎందుకు సిగ్గు సరోజిని గారు. మంగళివాడి ముందర కూర్చుని గుండు చేయించుకున్నప్పుడు లేని సిగ్గు గుండు చేస్తున్నప్పుడు మీకు కలిగిన అనుభవాన్ని చెప్పమంటే ఎందుకు సిగ్గు పడటం? మనం ఎలాగూ పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యాం కదా! ఇంకా నా దగ్గర నీకు సిగ్గు ఎందుకు? గుండు చేస్తున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారో తెలుసుకోవాలన్న కుతూహలంతో అడిగాను తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు."
'అది కాదండీ కుమార్ గారు. అసలే నేను ఈ గుండు తో సిగ్గుతో చచ్చిపోతున్నాను అలాంటిది మీతో ఎలా చెప్పమంటారు?'
" ఇదిగోండి ఇక ముందు నుంచి మనము 'గారు' అని పిలుచుకోవద్దు. ఏకవచనంతో పిలిచుకుందాం 'గారు' అని పిలిస్తే ఇద్దరి మధ్య ఏదో డిస్టెన్స్ ఉన్నట్టు ఫీల్ అనిపిస్తుంది. ఏమంటావు సరోజినీ?"
'అవునండి నాకు కూడా అదే అనిపించింది నేను కూడా మిమ్మల్ని కుమార్ అని పిలుస్తాను'.
"గుడ్. ఇక చెప్పు సరోజిని నీ గుండు అనుభవాన్ని తెలుసుకోవాలి అని నాకు చాలా ఆత్రుతగా ఉంది.'
No comments:
Post a Comment