గుండు తో గాయపడిన నా మనసు-1
ఊరు నుండి ట్రాన్స్ఫర్ అయి వచ్చిన సరోజిని మా క్లాస్ లో జాయిన్ అయ్యింది. చాలా తెలివి గలది పైగా చాలా అందంగా కూడా ఉంటుంది. మొదట్లో క్లాసు వాళ్ళు ఎవరు సరోజిని ని పెద్దగా పట్టించుకోలేదు.
నెమ్మదినెమ్మదిగా కాలేజీ అట్మాస్పియర్ కి, కాలేజ్ క్లాస్ రూమ్ వాతావరణానికి అలవాటు పడిన తర్వాత చదువు లో అందరి కంటే ముందు రావడం మొదలైంది. ఇప్పుడు అందరి దృష్టి సరోజిని మీద పడింది. అలాగే నా దృష్టి కూడా సరోజిని మీద పడింది.
అందరూ సరోజినీ అందానికి ఫిదా అయిపోతే నేను మాత్రం సరోజినీ అందమైన ఒత్తయిన నల్లటి పొడుగాటి జడ కి ఫిదా అయిపోయాను.
రోజు కాలేజీకి సరోజిని వదులుగా జడ వేసుకుని ఆ జడ లో ఒక పెద్ద గులాబీని పెట్టుకొని వచ్చేది. ఆ జడ అందమే నన్ను కట్టిపడేసింది.
ఎంతమంది తనతో మాట్లాడడానికి ట్రై చేసినా ముక్తసరిగా ఎవరినీ నొప్పించకుండా సమాధానం చెప్పి తప్పించుకునేది. దాంతో ఎవరూ తనకి దగ్గర అవ్వలేకపోయారు. నేను కూడా చాలాసార్లు ట్రై చేశాను కానీ దగ్గర అవ్వలేకపోయాను.
ఈలోపు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ వచ్చేసాయి. ఎగ్జామ్స్ అయిపోగానే ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. నేను మాత్రం రోజు సరోజినిని, సరోజినీ జడను తలుచుకోని రోజు లేదు.ఎక్కడ ఉంటుందో తెలియదు. ఇలా రోజులు గడిచేసరికి మా రిజల్ట్స్ వచ్చాయి నేను రిజల్ట్స్ చూసుకుందామని కాలేజీ కి వెళ్ళాను.
నోటీస్ బోర్డ్ దగ్గర చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. అందులో ఒక అమ్మాయి పొడుగాటి జుట్టు విరబోసుకుని చెవి పక్కగా గులాబీని పెట్టుకుని నాకు కనిపించింది. నేను సరోజినీ ఏమో అని డౌట్ పడ్డాను. ఒకపక్క సరోజినీ కాదేమో అని అనిపించింది ఎందుకంటే సరోజిని ఎప్పుడూ జుట్టుని విరబోసుకొని రాదు.
ఎంతో నిరుత్సాహంగా నేను నోటీస్ బోర్డ్ వైపు నడుస్తూ ఆ పొడుగు జుట్టు అమ్మాయి సరోజినీ అయితే బాగుండును అని దేవుడికి దండం పెట్టుకుని నోటీస్ బోర్డ్ దగ్గరకు వెళ్ళాను. సరాసరి ఆ పొడుగు జుట్టు అమ్మాయి వెనుక వైపు వెళ్లి నిలబడి నోటీస్ బోర్డ్ లోని రిజల్ట్స్ ని చూడడానికి ట్రై చేస్తున్నట్టు చేసి అమ్మాయి వైపు చూశాను ఆ అమ్మాయి జుట్టు నుంచి వచ్చే కమ్మటి షాంపు వాసన నన్ను కట్టిపడేసింది. నేను ఆ షాంపు వాసనల్ని ఆస్వాదిస్తూ ఉండగా ఆ అమ్మాయి తలని నా వైపు తిప్పి నవ్వుతూ "నెంబర్ ఎంత?" అని అడిగింది. కొంచెం సేపు నా నోట మాట రాలేదు నేను నోరు తెరుచుకుని అలా చూస్తూనే ఉండిపోయాను.
"ఏవండీ మిమ్మల్నే.. మీ నెంబర్ ఎంత నేను చూస్తాను చెప్పండి" అని అడిగింది.
ఆ అమ్మాయి అలా గద్దించి అడిగేసరికి నేను ఈ లోకం లోకి వచ్చి తడబడుతూ నా నెంబర్ చెప్పాను. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో కాదు నా సరోజినీదేవి నా కలల రాణి నా జడ రాణి.
నేను మనసులో దేముడికి వెయ్యి దండాలు పెట్టుకున్నాను. నా రిజల్ట్ గురించి కాదండోయ్ ఆ అమ్మాయి సరోజినీ అయినందుకు. నేను అలా ఉబ్బితబ్బిబ్బై ఉంటుంటే ఆ అమ్మాయి అదే సరోజిని నా నెంబర్ చూసి "కంగ్రాచ్యులేషన్స్ మీకు ఫస్ట్ క్లాస్ వచ్చింది" అని నా చెయ్యి తీసుకుని షేక్ హ్యాండ్ ఇచ్చింది.
ఇంక చూడండి నా ఆనందానికి హద్దులు లేవు నేను సరోజినీ చెయ్యిని వదిలిపెట్టలేదు. సరోజిని బలవంతముగా నా చేతిని విదిలించికుంటూ "ఏంటి అంత షాక్ అవుతున్నారు క్లాస్ రాదు అనుకున్నారా ఏంటి?" అని నవ్వుతూ అడిగింది.
తడబడుతూనే 'అదేమీ లేదండి నేను బాగానే రాశాను ఫస్ట్క్లాస్ వస్తుందనే అనుకున్నాను ఇంతకీ మీ రిజల్ట్ ఏమైంది?'
"నేను కాలేజీ ఫస్టు వచ్చానండి" నవ్వుతూ చెప్పింది.
వెంటనే నేను ఆమె చెయ్యి అందుకుని 'కంగ్రాచ్యులేషన్స్ అండి' అని షేక్ హ్యాండ్ ఇచ్చాను.
దాంతో సరోజినీ నవ్వుతూ "చాలా థాంక్స్ అండి" అంటూ వెనక్కి తిరిగింది.
నేను ఆ అవకాశాన్ని జార విడవకుండా "మరి పార్టీ ఎక్కడ ఇస్తున్నారు?" అని అడిగాను
దానికి సరోజినీ ముక్తసరిగా 'దీనికి పార్టీ ఎందుకండీ?' అంటూ 'అయినా సరే మీరు పార్టీ అడిగారు గా ఇదిగోండి' అంటూ తన హ్యాండ్ బ్యాగ్ లోంచి స్వీట్ ప్యాకెట్ తీసి నాకు ఇచ్చింది.
"చాలా థ్యాంక్స్ అండీ" అని చెప్పి నేను ఇంకా ఏదో అడిగే లోపల సరోజినీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది.
నేను షాక్ లో నుంచి తేరుకునే లోపలే సరోజినీ మాయమైపోయింది. ఎలాగైనా సరోజినీ అడ్రస్ పట్టుకోవాలి అని నా బైక్ తీసుకుని హడావిడిగా కాలేజీ బయటికి వచ్చి అటూ ఇటూ వెతుకుతున్నాను. కానీ దురదృష్టవశాత్తూ నాకు సరోజినీ కనిపించలేదు. నేను ఎంతో నిరాశగా ఇంటికి వెళ్లాను.
ఇంట్లో వాళ్ళందరూ "ఏంట్రా ఫస్ట్ క్లాస్ వచ్చినా కూడా నీ ఫేసులో ఆనందం ఏమీ లేదు" అని అడిగారు
నేను విసుగ్గా 'ఏముంది ఇందులో ఫస్ట్ క్లాస్ ఏ కదా కాలేజీ ఫస్ట్ కాదుగా' అని చెప్పి నా రూం లో కి వెళ్ళిపోయాను.
డిగ్రీ సర్టిఫికెట్ వచ్చేంతవరకు ఖాళీగా ఉండటం ఎందుకు అని మంచి టైప్ ఇనిస్ట్యూట్ చూసి జాయిన్ అయ్యాను. ఆ ఇనిస్ట్యూట్ మా బెస్ట్ ఫ్రెండ్ దే. అందుకని నేను ఎక్కువసేపు టైపింగ్ చేయడంలో నిమగ్నమై టైప్ ఇనిస్ట్యూట్ లోనే కాలం గడిపే వాడిని.
దేవుడు నాకు వరం ఇచ్చినట్టు నా జడ రాణి సరోజిని అక్కడ కనిపించింది.
"హలో సరోజిని గారు బాగున్నారా మీరు కూడా టైప్ లో జాయిన్ అయ్యారు అన్నమాట".
"అవునండి ఈ రోజుల్లో ఏదైనా జాబ్ కి టైపింగ్ ఉండాలి కదా అందుకని జాయిన్ అయ్యాను" అని చెప్పేసి వెళ్ళిపోయింది.
సరోజినీ వెళ్తున్నప్పుడు వెనకాల లయబద్దంగా ఊగుతున్న పొడుగాటి జడ ను చూస్తూ ఉండిపోయాను.
అలా చాలా రోజులు గడిచాయి ఈ రోజు ఇంక లాభం లేదని సరోజినీ కి తెలియకుండా సరోజిని వెనకాతల ఫాలో అయ్యి సరోజినీ ఇంటిని కనుక్కున్నాను. ఆ తర్వాత నాకు తెలిసింది నా బెస్ట్ ఫ్రెండ్ సరోజిని కూడా బెస్ట్ ఫ్రెండ్ అని.
సరోజినీ వాడితోనే కొంచెం క్లోజ్ గా ఉంటుంది ఫ్రీగా అన్ని మాట్లాడుతుంది అని తెలుసుకున్న నేను ఇంక మా ఫ్రెండ్ వెనక పడటం మొదలుపెట్టాను.
చాలాసార్లు రిక్వెస్ట్ చేసిన తర్వాత మా ఫ్రెండ్ నన్ను సరోజినీ ఇంటికి తీసుకువెళ్లడానికి ఒప్పుకున్నాడు. వెళ్లేటప్పుడు 'సరోజినీ ఒక్కతే ఒక ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటుంది నువ్వేమీ పిచ్చి వేషాలు వేయకు అక్కడ' అని చెప్పి తీసుకువెళ్ళాడు.
ఇంటికి వెళ్లేసరికి సరోజినీ ఏదో చదువుకుంటూ ఉంది. మా ఫ్రెండ్ ని చూడగానే "హాయ్ రాజేష్ గారు రండి" అని లోపలికి పిలిచింది.
లోపలికి వెళ్తూనే మా ఫ్రెండ్ రాజేష్ 'వీడు నా బెస్ట్ ఫ్రెండ్ కుమార్' అని పరిచయం చేశాడు.
"హలో కుమార్ గారు నమస్తే అయినా రాజేష్ గారు ఈయన నాకు తెలుసు. కూర్చోండి" అంటూ లోపలికి వెళ్లి కాఫీ తీసుకుని వచ్చింది.
నేను సరోజినీ జడను చూడడానికి ట్రై చేస్తే సరోజినీ పెద్ద కొప్పు లాగా పెట్టుకొని ఉంది. ఓహో ఇంట్లో ఉండేటప్పుడు ఇలా ఉంటుందేమో అని అనుకున్నా.
కొంచెం సేపు పిచ్చాపాటిగా మాట్లాడిన తర్వాత ఇద్దరం బయల్దేరి వచ్చేసాం.
ఆ తర్వాత కొన్ని రోజులకు నెమ్మదినెమ్మదిగా నేను ఒక్కడినే సరోజినీ ఇంటికి వెళ్ళడం మొదలు పెట్టాను. దాంతో సరోజిని కూడా నాతో కొంచెం ఫ్రీగా ఉండటం మొదలు పెట్టింది.
ఈ రోజు నేను సరోజినీ ఇంటికి వెళ్ళేటప్పటికి సరోజినీ తల స్నానం చేసి తడి జుట్టుని టవల్ తో తుడుచుకుంటూ తలుపు తీసింది. అప్పుడు తన తడి జుట్టు తన మొహాన్ని కప్పేస్తూ జుట్టు నుండి పడుతున్న నీటి బిందువులతో తడిసిన ఆమె మోము నాకు చాలా సెక్సీ గా కనిపించింది. నేను తన జుట్టు అందాన్ని చూస్తూ అలాగే నిలబడి పోయే సరికి
"ఏంటి లోపలికి రారా అక్కడే నిలబడ్డారు?" అంటూ కొంటెగా నవ్వింది.
"లోపలికి రండి" అంటూ పిలవగానే అప్పుడు నన్ను నేను కంట్రోల్ చేసుకుంటూ లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చున్నాను.
తను నా ఎదురుగా ఉన్న సోఫా లో కూర్చుని నాతో కబుర్లు చెబుతూ తల తుడుచుకుంటూ ఉంది. మధ్య మధ్యలో తన జుట్టు మొత్తాన్ని ఒక వైపుకు తెచ్చుకుని తుడుచుకుంటూ ఉంటుంటే జుట్టుతో సగం కప్పేసిన ఆమె మొహాన్ని చూస్తూ ఉంటే ఏవేవో కోరికలు చెలరేగాయి.
అలా తుడుచుకుంటూ తను ఒక్కసారిగా లేచి నా వైపు వచ్చింది. నేను ఒక్కసారిగా గాభరా పడ్డాను.
తను నా ముందు నిలబడి నా వెనకాతల ఉన్న అల్మారా ఓపెన్ చేసి అందులో ఉన్న హెయిర్ డ్రైయర్ తీసుకోవడానికి ట్రై చేస్తుంటే తన తడి జుట్టు నా మొహాన్ని కప్పేసి అటు ఇటు ఊగ సాగింది. అప్పుడు తడి జుట్టు నుండి కారుతున్న నీటి బిందువులతో నా మొహం తడిసిపోయింది. ఆమె జుట్టు నుండి వస్తున్న షాంపూ వాసన నన్ను పిచ్చివాడిని చేసింది. ఇంక నేను ఆపుకోలేక చేతితో నా మొహం పై పడిన ఆమె జుట్టు పట్టుకుని పక్కకు తీశాను.
సరోజిని హెయిర్ డ్రయ్యర్ తీసుకుని వెళ్ళి సోఫాలో కూర్చుంది. అలా కూర్చుని ఇంకొంచెం సేపు టవల్తో తుడుచుకుని జుట్టుని హెయిర్ డ్రయ్యర్ తో ఆరబెట్టుకోవడం మొదలుపెట్టింది. హెయిర్ డ్రయ్యర్ గాలికి ఆమె జుట్టు అలా ఎగురుతూ ఉంటే నేను అది చూస్తూ ఏదో లోకంలోకి వెళ్ళిపోయాను.
నేను చూస్తుండగానే నాతో కబుర్లు చెబుతూ జుట్టు చిక్కులు తీసుకుని నెమ్మదిగా జడ వేసుకోవడం మొదలుపెట్టింది. అలా జడ వేసుకొని ఒక గులాబీ పువ్వు ని తీసుకుని మధ్యలో పెట్టుకుంది.
నేను కొంచెం ధైర్యం చేసి "మీ జడ చాలా బాగుందండి. ఇంత పొడవైన జడని నేను ఎక్కడా చూడలేదు. మీరు మీ జుట్టు ని బాగా మెయింటెన్ చేస్తున్నారు" అని మెచ్చుకున్నాను.
సరోజిని చాలా సింపుల్ గా సిగ్గుపడుతూ 'చాలా థ్యాంక్స్' అండీ.
అప్పటికే నేను వచ్చి చాలా సేపు అవ్వటం వల్ల నేను బయలుదేరుతాను అని చెప్పేసి వచ్చేసాను. కానీ నా మనసులో ఇంకా కొంచెం సేపు కూర్చుని ఆమె జడ అందాన్ని ఆస్వాదించాలని ఉంది కానీ బాగుండదని వచ్చేసాను.
ఒక వారం రోజుల తర్వాత సరోజినీ ఇంటికి వెళ్ళాను. నన్ను చూసి నవ్వుతూ లోపలికి పిలిచింది.
నేను లోపలికి వెళ్ళి కూర్చోగానే కాఫీ తీసుకుని వచ్చి ఇస్తూ దాంతో పాటు తన ఫోటో ఆల్బం ని ఇచ్చి "దీన్ని చూస్తూ ఉండండి నేను స్నానం చేసి వస్తాను" అని బాత్రూం లోకి వెళ్ళింది. 'సరే అలాగే కానివ్వండి' అని నేను కాఫీ తాగుతూ తన ఫోటో ఆల్బం ని చూడటం మొదలు పెట్టాను.
ఆల్బమ్ చూడడం పూర్తయ్యేసరికి బాత్రూంలోనుండి తలస్నానం చేసి తలకి పిడప లాగా పెట్టుకొని బయటకు వచ్చింది. వెంటనే అద్దం ముందు నిలబడి హడావిడిగా తయారవుతూ తలకి ఉన్న పిడపని విప్పదీసి జుట్టుని విరబోసి తడిసి ఉన్న జుట్టు ని ఆర పెట్టుకోకుండా హెయిర్ క్లిప్ పెట్టి వదిలేసింది.
తను మాట్లాడుతుంటే ఏదో నెర్వస్ గా ఫీల్ అవుతున్నట్టు నాకు అనిపించింది. ఎందుకో కొంచెం టెన్షన్ గా కూడా ఉన్నట్టు అనిపించింది. 'ఏమండీ సరోజిని గారు ఏమైనా ప్రాబ్లమా? అలా ఉన్నారు ఏంటి?'
"ఏమీ లేదు... ఏమీ లేదు.. ఒక పని ఉంది మీరు ఏమీ అనుకోకుండా ఉంటే నన్ను అక్కడ టెంపుల్ ఉంది కదా అక్కడ దించేసి వెళ్తారా?" అని అడిగింది.
నేను అదే మహాభాగ్యం అనుకుని 'తప్పకుండా... అలా రిక్వెస్ట్ చేస్తారు ఏంటండీ?' అని అన్నాను.
తను హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని 'పదండి' అని బయలుదేరదీసింది.
"ఏంటండీ.. ఇలా తడి జుట్టుతోనే వచ్చేస్తారా? తల తుడుచుకోరా?" అని అడిగాను.
'పర్వాలేదండి...కొంచెం పని ఉంది పదండి' అంటూ బయల్దేర తీసింది.
నాకేమీ అర్థం కాలేదు సరే అని బండి తీయగానే బండి ఎక్కి వెనక కూర్చుంది.
తను చెప్పిన టెంపుల్ దగ్గరికి తీసుకువెళ్లి బండి ఆపగానే గాబరా గాబరా గా బండి దిగి 'థాంక్స్ అండి' అని చెప్పి హడావిడిగా టెంపుల్ లోపలికి టెన్షన్ టెన్షన్ గా వెళ్ళింది. కనీసం నన్ను లోపలికి రమ్మని కూడా అనలేదు.
బయట నుండి చూస్తే టెంపుల్ చాలా ఖాళీగానే ఉంది. నేను ఒక ఐదు నిమిషాలు వెయిట్ చేసి తను ఇంకా రాక పోయేటప్పటికి ధైర్యం చేసి టెంపుల్ లోపలకి నెమ్మదిగా వెళ్లాను.
టెంపుల్ లో అక్కడక్కడ ఇద్దరు ముగ్గురు కనిపించారు కానీ నాకు సరోజినీ కనిపించలేదు లోపలికి వచ్చింది కదా ఎక్కడికి వెళ్ళింది అని అటూ ఇటూ చూస్తుంటే ఎదురుగా ఉన్న ఒక షెడ్ కనిపించింది. షెడ్ పక్కనే ఒక బోర్డ్ మీద "ఇక్కడ గుండ్లు గీయబడును" అని రాసి ఉంది.
సరోజిని షెడ్ లోకి వెళ్ళింది ఏమో అని నాకు అనిపించింది. అయినా తను ఎందుకు గుండు గీసే ప్లేస్ కి వెళ్తుంది అని ఆలోచిస్తూ నెమ్మదిగా షెడ్ దగ్గరికి చేరుకొని లోపలికి తొంగి చూశాను.
అది చాలా పెద్ద షెడ్.
లోపల ఒక చివరగా ఒక మంగలి వాడు కూర్చుని ఉన్నాడు. అతనికి ఎదురుగా ఒక ఆవిడ కూర్చుని ఉంది. నేను చాలా దూరంగా ఉండడం వల్ల నాకు క్లియర్ గా కనిపించలేదు.
ఆ మంగలి ముందర కూర్చున్న అమ్మాయి సరోజిని కాదు కదా అని సందేహం వచ్చింది నాకు. నేను నెమ్మదిగా నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ లోపలికి వెళుతుంటే ఆ మంగలి వాడు ఆ అమ్మాయి తలని వంచుతూ కనిపించాడు. ఆమె రెండు చేతులతో తన ఒడిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ ని హెయిర్ క్లిప్ ని పక్కన పెట్టింది.
ఆ పక్కన పెట్టిన రెండింటిని చూసిన నాకు దిమ్మతిరిగిపోయింది. ఎందుకంటే పొద్దున్న సరోజినీ అదే బ్యాక్ ని పట్టుకుని వచ్చింది తన జుట్టు కి అదే హెయిర్ క్లిప్ ని పెట్టుకుంది అంటే ఆ అమ్మాయి సరోజినీ అన్నమాట.
ఎందుకు తను ఇలా మంగళివాడి ముందర కూర్చుంది? కొంపతీసి గుండు చేయించుకోవడానికి కాదు కదా ? అన్న ఆలోచన రాగానే
వెంటనే నా గుండె దడ దడ దడ మంటూ కొట్టుకోవడం మొదలయింది. నా గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి.
No comments:
Post a Comment