గుండు తో గాయపడిన నా మనసు -3
వెంటనే సరోజినీ సిగ్గుపడుతూ తలని కిందకి దించుకుని అయితే వినండి కుమార్.
"నేను ఆరోజు నిజంగానే చాలా నెర్వస్ గా ఉన్నాను ఎందుకంటే అంత పొడుగాటి జుట్టుని గుండు చేయించుకోవడం అంటే మాటలు కాదు కదా! ఎందుకంటే నేను అంతవరకూ నా జుట్టు ని ఒక ఇంచ్ కూడా కత్తిరించు కోలేదు అలాంటిది నేను మంగలివాడి దగ్గరికి వెళ్లి నిలబడగానే వాడు 'ఏంటమ్మా కత్తెర్లా?' అని అడిగాడు నా జుట్టు ని చూస్తూ. ఎందుకంటే అంత పొడుగాటి జుట్టు ని ఎవరు గుండు చేయించుకోరు కదా!
మంగలి వాడు అలా అడుగుతుంటే నాకు చాలా సిగ్గు అనిపించింది. నేను సిగ్గు పడుతూ చిన్న స్వరముతో "కత్తెర్లు కాదండి గుండు చెయ్యాలి" అని అడిగాను.
అప్పుడు మంగలి వాడు నా వైపు వింతగా చూసాడు. ఆ చూపు నాకు ఇంకా గుర్తుంది ఎందుకంటే అంత పొడుగాటి జుట్టు ఉన్న అమ్మాయి వచ్చి గుండు చెయ్యమని అడిగితే ఎవరికైనా వింతగానే ఉంటుంది కదా! నేను అనుకోవడం ఆ మంగలి వాడు ఇంతవరకూ నాలాంటి అందమైన పొడుగాటి జుట్టు ఉన్న ఏ అమ్మాయికి గుండు చేయలేదు అన్నట్టు అనిపించింది. అందుకే అతను ముసిముసి నవ్వులు నవ్వుతూ "కూర్చోండి" అని అన్నాడు.
నేను కొంచెం సిగ్గు పడుతూనే అతని ముందర కూర్చున్నాను. అతను నా తల పై చేయి వేసి "ముందుకు జరగండి" అని అన్నాడు.
అప్పుడు నేను అతని ముందుకి జరిగాను. అప్పుడు మంగలి వాడు నా తలని బాగా ముందుకు వంచితే నా తల ఆల్మోస్ట్ అతని ఒడిలో ఉన్నట్టు అనిపించింది.
అతను నేను పెట్టుకున్న హెయిర్ క్లిప్ ని తీసి నాకు ఇచ్చాడు. అతను అలా చేస్తూ ఉంటే నాకు ఏదో లాగా అనిపించింది.
వెంటనే అతను నా వెనక వైపు జుట్టుని రెండు భాగాలు చేసి ముందువైపు రెండు భుజాల వైపుకి వేశాడు. అలా వేసి పక్కనే బకెట్ లో ఉన్న నీళ్లను తీసుకుని నా తలపై పోసి రెండు చేతులతో మసాజ్ చేస్తుంటే నేను సిగ్గుతో చచ్చిపోయాను. అందులో ఒక పరాయి మగవాడు నా జుట్టులోకి చేతులు పెట్టి అలా కెలుకుతుంటే నాకు ఏదో లాగా అయిపోయింది.
కొంచెం సేపు అలా మసాజ్ చేసి రెండు వైపులా జుట్టుని రెండు ముడులు వేశాడు. తరవాత పక్కన ఉన్న టవల్ తో తన చేతులను తుడుచుకుని ఆ పక్కనే ఉన్న మంగలి కత్తిని తీసుకుని కొత్త బ్లేడ్ ని వేశాడు. కొత్తగా వేసిన బ్లేడుతో ఉన్న మంగలి కత్తి తళతళ మెరుస్తూ కనిపించింది నాకు.
వెంటనే అతను నన్ను ఇంక ఏమీ అడగకుండా నా తలను బాగా వంచి అతని ఒడిలోకి ఆనించుకున్నాడు. ఒక చేత్తో నా తలని గట్టిగా పట్టుకుని మంగలి కత్తిని నా తల మధ్య భాగంలో పెట్టి వెనక్కి kasak మంటూ ఒక జెర్క్ ఇచ్చాడు. దాంతో నేను ఒక్కసారిగా వణికిపోయాను.
నా తల పైన ఏమి జరుగుతుందో నాకు అర్థం కాలేదు. అలా మంగలి వాడు రెండు మూడు జర్కులు ఇచ్చేసరికి నా తల రెండు వైపుల నుండి నా జుట్టు జారడం మొదలుపెట్టింది.
నా తల పైన గుండు గీసిన ప్రదేశమంతా చల్లగా అనిపించింది.
ఇంక మంగలి వాడు కత్తితో జర్కులు ఇస్తూ స్పీడ్ పెంచాడు. దాంతో నా తల పైభాగం వెనక భాగం అంతా పూర్తిగా గీసేసినట్లు అనిపించింది.
నెమ్మదిగా అతను నా అరగుండు పై చేతిని వేసి కత్తిని ముందువైపు జరుపుతూ నెమ్మది నెమ్మదిగా నా తలను పైకి ఎత్తుతున్నాడు.
అతను అలా చేస్తుంటే చివరకి నా రెండు జుట్టు ముడులు రెండు చెవుల వైపు దగ్గర నుండి వేలాడడం మొదలైంది.
అప్పుడు మంగలి వాడు నా తలని పక్కకి తిప్పి ఒక చెవి వైపు జుట్టుని గీకడం మొదలు పెట్టాడు. పావు క్షణంలో అక్కడినుండి జుట్టు ముడి నా ఒడిలో దభీమని పడిపోయింది. తర్వాత నా తలను రెండవవైపు తిప్పి అక్కడ కూడా గొరగడం మొదలు పెట్టాడు. అప్పుడు అక్కడి నుండి కూడా జుట్టు ముడి దభీమని జారి నా ఒడిలో పడిపోయింది".
"అంత పొడవాటి జుట్టు ని మంగలి వాడు గొరుగుతున్నప్పుడు నీకు బాధ అనిపించలేదా?"
'ఎందుకు అనిపించలేదు అండి మంగలి వాడు నా తలని వంచి మంగలి కత్తిని నా తలమీద ఆనించగానే నా కళ్ళవెంట బొటబొటా మంటూ నీళ్లు వచ్చేసాయి. చివరికి రెండు జుట్టు ముడులు తెగి నా ఒడిలో పడినప్పుడు నా బాధ దేవుడికే తెలుసు. మంగలి వాడు నా ఒడిలో ఉన్న రెండు జుట్టు ముడులను తీసి పక్కన పెడుతుంటే నేను ఎంత ఏడ్చానో నాకే తెలుసు. గుండు గీయడం అయిపోయిన తర్వాత మంగలి వాడు మంగలి కత్తి తో నా నుదురు, నా రెండు చెంపలు గీస్తుంటే నాకు ఏదో లాగా అయిపోయింది.
నాకు గుండు గీసే కార్యక్రమం అయిపోయిన తర్వాత లేచి వెనక్కి వస్తున్నప్పుడు ఆ పక్కనే నిర్జీవంగా పడి ఉన్నా అందమైన జుట్టు ముడులను చూడగానే నాలో దుఃఖం పొంగి పొరలింది. ఆ రోజుతో నాకు ఆ జుట్టుతో రుణం తీరిపోయింది అని అనుకున్నాను. మనసు దిటవు చేసుకుని అక్కడి నుండి వచ్చేసాను."
'అయితే మీరు గుండు గీస్తున్నప్పుడు చాలా బాధ పడ్డారు అన్నమాట'
" అవును ఎవరైనా బాధపడతారు కదా? ఎందుకు అలా అడిగారు?
'నేను చాలా మందిని చూశాను అండి. ఎక్కువ మంది ఆడవాళ్ళు గుండు గీస్తున్నప్పుడు ఆనందిస్తూ కనిపించారు. మీరు కూడా ఎంజాయ్ చేసి ఉంటారు అని అనిపించింది'
"మీరు చెప్పింది నిజమేనండి. గుండు గీస్తున్నప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. ఒక తెలియని తీపి బాధ లాగా కనిపించింది. నాకున్న పొడుగు జుట్టు పోతుందన్న బాధ మాత్రం ఉంది కానీ ఒకే ఒక్క సంతోషం ఏమిటంటే నేను ఒప్పుకున్న తర్వాత అతను తిరిగి కోలుకున్నాడు. నా అందమైన జుట్టు పోతే పోయింది ఒకళ్ళకి లైఫ్ ఇచ్చాను కదా అన్న శాటిస్ఫ్యాక్షన్ ఉంది."
'అవును సరోజినీ అది మాత్రం నిజం జుట్టు ది ఏముంది? మళ్లీ కొన్ని సంవత్సరాలలో పెరుగుతుంది.'
అంటూ సరోజినీ గుండు మీద చెయ్యి వేసి నిమురుతూ అన్నాను.
దాంతో సరోజినీ తన గుండు ను నా ఎద మీద పెట్టి "మీరు చెప్పేది నిజమే కుమార్" అని అంది.
అలా ఒక రెండు మూడు నెలలు గడిచాయి. నేను కష్టపడిన దానికి నాకు ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చింది. దాంతో ఇంట్లో అందరూ, సరోజిని కూడా చాలా సంతోషించింది.
సరోజినీ కూడా ఒక మంచి ప్రైవేట్ కంపెనీలో జాబ్ సంపాదించింది. అప్పటికీ సరోజినీ జుట్టు బాయ్ కట్ మాదిరిగా పెరిగి ఉంది. ఇద్దరం జాబ్స్ చేసుకుంటూ ఉండగానే ఒక సంవత్సరం తిరిగింది. అప్పటికి సరోజినీ జుట్టు భుజాల కిందుగా పెరిగి ఉంది.
ఇప్పుడు మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు. నేను వెంటనే సరోజినీ గురించి చెప్పాను. వాళ్లు సరే అని ఒప్పుకొని 'ఒకసారి తీసుకు రా మాట్లాడుదాం' అన్నారు. నేను వెంటనే ఎగిరి గంతేసి సరోజిని ఇంటికి బయలుదేరి వెళ్లాను.
నేను సరోజినీ ఇంటికి వెళ్ళేటప్పటికి 7:30 అయింది సరోజినీ ఇంకా ఇంటికి రాలేదు ఏంటి ఎప్పుడు అయిదింటికల్లా వచ్చేస్తుంది కదా 7:30 అయినా రాలేదు ఏంటని అక్కడే ఒక 10 నిమిషాలు వెయిట్ చేశాను. ఇంకా రాలేదు సరే రేపు వద్దాం లే అని బండి తీస్తుండగా ఆటో వచ్చి ఆగింది. అందులోంచి సరోజినీ దిగింది. నన్ను చూసి "హాయ్ కుమార్ ఎప్పుడు వచ్చారు? ఎంత సేపు అయింది?"
నేను సరోజినీ ని చూడగానే కొంచెం స్టన్ అయ్యి...
"ఏమీ లేదు సరోజినీ ఇప్పుడే వచ్చాను అయినా ఏంటి ఇంత లేటు ఈరోజు?"
'ఏం లేదు కుమార్ హెయిర్ కట్ చేయించుకుందామని బ్యూటీ పార్లర్ కి వెళ్లాను అందుకని లేట్ అయింది.'
"ఏంటి నువ్వు అసలు నీ జుట్టు ని కత్తిరించుకోవాలి అంటే ఇష్టం ఉండదు కదా? అలాంటిది హెయిర్ కట్ ఎలా చేయించుకున్నావు?" అని అడిగాను.
'నేను ప్రైవేట్ కంపెనీలో చేస్తున్నాను కదా! కొంచెం మోడ్రన్ గా ఉండాలి అని అన్నారు. అందుకనే చేయించుకున్నాను. ఏమీ బాగాలేదా హెయిర్ కట్?' అని అడిగింది.
తను భుజాల కిందుగా పెరిగిన జుట్టుని కొంచెం పొట్టిగా భుజాలపై వరకు కట్ చేయించుకుని ఉంది.
"బానే ఉంది అనుకో కానీ" కొంచెం నసిగాను.
ఎందుకంటే ఎప్పుడెప్పుడు సరోజినీ జుట్టు ఇదివరకటి లాగా నడుము కింద వరకు పెరుగుతుందా ఎప్పుడు జడ వేసుకుని నాకు కనిపిస్తుందా అని ఎదురు చూశాను. అలాంటిది ఇప్పుడు తన జుట్టుని పొట్టిగా కత్తిరించుకొని వచ్చింది. నేను అన్న మాటలకి సరోజిని వెంటనే
"నీకు నచ్చినట్టు లేదు లే నా హెయిర్ కట్. నిజం చెప్పండి బాగుందా? లేదా?"
'బానే ఉంది సరోజినీ కానీ జుట్టు ని కొంచెం పెరగనివచ్చు కదా?'
"ఏం నీకు షార్ట్ హెయిర్ నచ్చదా?"
'ఏది ఏమైనా నువ్వు పొడుగు జుట్టు లోనే చాలా అందంగా ఉంటావు ఇలాంటి షార్ట్ హెయిర్ కట్స్ అందరికీ నప్పవు.'
"సరే కుమార్ ఇక ముందు నేను ఎప్పుడూ నేను జుట్టు ని కత్తిరించుకోనులే" అంటూ లోపలికి తీసుకువెళ్ళింది.
లోపలికివెల్తూ సరోజినీ వెనకాతల నుండి తన జుట్టుని గమనిస్తూనే ఉన్నాను. అలా పొట్టిగా కత్తిరించిన జుట్టుతో సరోజినీ మెడ అంతా కనిపిస్తూ ఉంది. సరోజినీ ముందువైపు జుట్టుని పొట్టి పొట్టి గా కత్తిరించి లేయర్స్గా కత్తిరించి ఉంది.
లోపలికి వెళ్ళగానే సరోజినీ తన హ్యాండ్ బ్యాగ్ ని పక్కన పెట్టి వెళ్లి ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకుని తన పొట్టి జుట్టు కి పెట్టుకుంది. అప్పుడు చూస్తే సరోజినీ తల వెనకాతల చిన్న పిలక లాగా ఉంది. తలకు రెండు వైపులా పొట్టిగా కత్తిరించిన జుట్టు అందులో కలవక పక్కనుండి వేలాడుతూ కనిపించాయి.
సరోజినీ తల వెనుక ఉన్న చిన్న పిలక ని చూడగానే నాకు అంతకు ముందు అక్కడ వేలాడుతూ ఉండే పొడుగాటి నల్లటి జడ ఆ జడ లో గులాబీ పువ్వు గుర్తొచ్చాయి.
నేను ఒక నిట్టూర్పు విడిచి సోఫాలో కూర్చున్నాను నేను ఇంకెన్ని సంవత్సరాలు ఆగాలో అంత పొడుగాటి జడ చూడాలి అంటే అని ఆలోచిస్తూ ఉండగా సరోజినీ కాఫీ తీసుకుని వచ్చింది.
అప్పుడు చెప్పాను పెళ్లి విషయం. తను చాలా సంతోషించింది 'అయితే ఎప్పుడు తీసుకువెళుతున్నావు నన్ను మీ ఇంటికి?' అని అడిగింది.
"నీ ఇష్టం నువ్వు ఎప్పుడంటే అప్పుడే'
"సరే రేపు ఆదివారం వస్తాను మీ ఇంటికి".
'అలాగే తప్పకుండా' అని చెప్పేసి వచ్చేసాను.
ఆదివారం సరోజిని తీసుకురావడానికి సరోజిని ఇంటికి వెళ్ళాను. ఇప్పటికే సరోజినీ రెడీ అయి ఉంది.
మంచిగా చీర కట్టుకొని షార్ట్ గా బాబ్ కట్టింగ్ చేయించుకున్న జుట్టుని చక్కగా దువ్వుకుని ఫ్రీగా వదిలేసి రెడీగా ఉంది.
నేను తనని బండి మీద ఎక్కించుకుని ఇంటికి తీసుకు వచ్చాను.
నేను కొంచెం భయపడుతూనే సరోజినీ ఇంటికి తీసుకు వచ్చాను. ఎందుకంటే మాది కొంచెం ఆర్థడాక్స్ ఫ్యామిలీ. అమ్మ నాన్నలకు కొంచెం చాదస్తం ఎక్కువ. మా అమ్మ అయితే ఎదుటివాళ్ళు ఏమనుకుంటారో అని చూడకుండా మాట్లాడేస్తూ ఉంటుంది.
సరోజిని ఇంట్లోకి తీసుకుని వచ్చి పరిచయం చేశాను. నా పుణ్యం పుచ్చి మా నాన్నగారయితే ఏమీ మాట్లాడలేదు.
మా అమ్మ మాత్రం "అమ్మాయి లక్షణంగా ఉంది రా. ఆ చీర, కట్టు, బొట్టు చాలా బాగుంది కానీ... ఏంటి అమ్మాయి జుట్టుని అలా కత్తిరించుకున్నావు? మగరాయుడిలాగా! చక్కగా జుట్టు పెంచుకుని జడ వేసుకోవచ్చు కదా?" అని అంది.
ఆ మాటలకి సరోజినీ నా వైపు చూసింది.
"అది కాదమ్మా తను ఒక పెద్ద ప్రైవేట్ కంపెనీలో పని చేస్తుంది కదా! అక్కడ కొంచెం మోడరన్ గా ఉండాలి. అందుకనే తను జుట్టుని కత్తిరించుకుంది అంతే" అని సమర్దించాను.
'పెద్ద కంపెనీ అయితే మాత్రం జుట్టుని కత్తిరించుకోవాలి అంటరా? నీట్ గా జడ వేసుకుని కూడా అందంగా తయారు అవ్వచ్చు కదా? దానికి ఇలా జుట్టుని కత్తిరించుకోవాలా?' అని అమ్మ అనేసరికి
"లేదమ్మా తను ఇంక జుట్టుని కత్తిరించుకోదు. నేను చెప్పేసాను కూడా దానికి తను ఒప్పుకుంది ఇక ముందు తను తన జుట్టును కత్తిరించుకోను అని చెప్పింది. అయినా ఇది వరకు తన జుట్టు చాలా పొడుగ్గా నడుము కింద వరకు ఉండేది తెలుసా?"
'మరి అయితే ఏం పోయేకాలం రా? అంత పొడుగు జుట్టు ని కత్తిరించేసుకుంది. ఆడవాళ్ళు ఇలా జుట్టుని పొట్టిగా కత్తిరించుకోవడం అనేది మన ఇంటా వంటా లేదు'.
ఆవిడ మాటలకి సరోజినీ కొంచెం అసహనం గా ఫీల్ అయింది.
"సరేలే అయిందేదో అయిపోయింది ఇంతకీ అమ్మాయి నచ్చిందా లేదా చెప్పు?"
'నేను ఇందాక చెప్పాను కదా ఆ అమ్మాయి లక్షణంగా ఉందని. కాకపోతే జుట్టు విషయంలోనే నేను కొంచెం సంశయుస్తున్నాను.'
"నువ్వేమీ తన జుట్టు విషయంలో సంశయించక్కర్లేదు అమ్మ. తను ఆల్రెడీ చెప్పేసింది ఇంక ముందు జుట్టు కత్తిరించుకోను అని". దాంతో అమ్మ నాన్న ఇద్దరూ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
దాంతో నేను సరోజినీ చాలా సంతోషించాం.
"అయితే ఇంకెందుకు ఆలస్యం అరేయ్ నువ్వు వెళ్లి పక్కన ఉన్న జాతకాలు చూసే జ్యోతిష్యుని తీసుకురా" అని అన్నారు నాన్నగారు.
నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన్ని తీసుకుని వచ్చాను. ఆయన మా ఇద్దరి డేటాఫ్ బర్త్ లను చూసి జాతకాలు వేసి సరి చూశాడు జ్యోతిష్యుడు .
"ఇద్దరికీ బాగా సరిపోయింది. అమ్మాయి మీ ఇంట్లో చెప్పావా?" అని అడిగారు
'ఆల్రెడీ చెప్పానండి. వాళ్ళు నేను ఏదంటే అదే అని ఒప్పుకున్నారు'
వెంటనే మా అమ్మ "అయితే ఒక మంచి ముహూర్తం చూడండి" అని చెప్పింది.
జ్యోతిష్యుడు రకరకాల లెక్కలు వేసి 'అమ్మ ఇప్పుడు శూన్యమాసం నడుస్తుంది. ముహూర్తాలు లేవు. ఇద్దరి జాతకాలు కలిసే బలమైన ముహూర్తం ఇంకొక తొమ్మిది నెలలు తర్వాత ఉంది పెట్టమంటారా?' అని అన్నాడు "అలాగే పెట్టండి" అని అంది అమ్మ.
వెంటనే జ్యోతిష్కుడు తొమ్మిది నెలల తర్వాత ఒక డేట్ ని ఫిక్స్ చేసి చెప్పాడు.
వెంటనే మా అమ్మ "సరోజినీ వెంటనే మీ ఇంట్లో చెప్పు ఈ విషయం. మీ వాళ్లు ఒప్పుకుంటే వెంటనే మీ ఇంటికి వచ్చి ముహూర్తం కాయం చేసుకుందాం సరేనా?" అంది.
'అలాగే అత్తయ్య గారు మీ ఇష్టం నేను ఇప్పుడే చెప్తాను' అంటూ వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి చెప్పింది. వెంటనే వాళ్ళు ఒప్పుకొని నెక్స్ట్ ఆదివారమే వీళ్ళని రమ్మని చెప్పారు.
"అమ్మాయి సరోజిని ఇప్పుడే చెప్తున్నాను ఇక ముందు నువ్వు జుట్టు మాత్రం కత్తిరించుకోకూడదు సరేనా?"
సరోజినీ సంతోషంగా ఒప్పుకొని 'అలాగే అత్తయ్య గారు ఇంక ముందు నేను జుట్టుని కత్తిరించుకోను' అని చెప్పింది.
అలా నెక్స్ట్ ఆదివారం మేమందరం సరోజినీ ఇంటికి వెళ్లడం వాళ్ళందరూ ఒప్పుకోవడం ముహూర్తం ఖాయం చేయడం జరిగిపోయింది.
ఇద్దరం చాలా సంతోషించాం ఇక సరోజినీ మీద నాకు పూర్తి హక్కులు వచ్చినట్టు అనిపించాయి. అలా రెండు మూడు నెలలు గడిచాయి సరోజినీ ఇంటికి వెళ్ళేటప్పటికి సరోజినీ నాకు స్వీట్స్ అందిస్తూ "నాకు రెండు ప్రమోషన్లు ఇచ్చారు. ఇప్పుడు నాకు శాలరీ ఎంతో తెలుసా?" అని చెప్పింది. అది నా శాలరీ కంటే మూడు రెట్లు ఎక్కువ. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయి "కంగ్రాచులేషన్ సరోజినీ" అని చెప్పాను.
వెంటనే సరోజినీ 'థాంక్స్ కుమార్ అయితే ఒక చిన్న రిక్వెస్ట్' అంది.
"ఏంటి సరోజిని?" అన్నాను.
'అది... అది...' అంటూ నసిగింది.
"పర్వాలేదు చెప్పు" అన్నాను.
"నెక్స్ట్ వీక్ ఫారిన్ లో ఉన్న మా హెడ్ ఆఫీస్ నుండి మా కంపెనీ సీఈఓ వస్తున్నారు. ఆయనకి పీఏ గా నన్ను వెళ్ళమన్నారు. ఆయన ఇక్కడ ఒక నెల రోజులు ఉంటారు.
"అయితే ఏంటి? మంచిదే కదా?"
'అది కరెక్టే కుమార్. కానీ....'
"కానీ ఏంటి?"
'ఆయనతో పీఏ గా ఉండడానికి నేను కొంచెం మోడరన్ గా తయారవ్వాలి.'
"అవ్వు. అందులో తప్పేముంది?"
'మోడ్రన్ గా తయారవ్వాలి అంటే నేను అనుగుణంగా హెయిర్ కట్ చేయించుకోవాలి అని చెప్పారు'.
"అమ్మో మళ్లీ హెయిర్ కటింగ్ ఆ? మా అమ్మ తిడుతుంది ఏమో!"
'అందుకనే అడుగుతున్నాను కుమార్. ఏం చేయాలో అర్థం కావట్లేదు. లేకపోతే ఈ డబల్ ప్రమోషన్ ని నేను రిజెక్ట్ చేయాలి'.
"వద్దులే నేను మా అమ్మకు ఏదో సర్ది చెబుతాలే."
'థాంక్యూ కుమార్ ఒప్పుకున్నందుకు. నువ్వు జుట్టు కత్తిరించు కోవద్దు కావాలంటే ఉద్యోగం మానేయ్ అని అంటావేమో అని భయపడ్డాను'.
"నిన్ను ఉద్యోగం ఎందుకు మానేయ్ అని అంటాను? సరోజిని నీది నా కంటే మంచి ఉద్యోగం చాలా ఎక్కువ జీతం కూడా. అలాంటి ఉద్యోగం నాకైతే రాదు. అలాంటిది ఎలా మానేయ్ అంటానని అనుకున్నావా!"
'సరే అయితే రేపు వెళ్లి నేను హెయిర్ కట్ చేయించుకుని వస్తాను'.
"వద్దు వద్దు నువ్వు ఒక్కదానివే పెళ్లి జుట్టు కత్తిరించుకుని రావద్దు. నేనే తీసుకుని వెళ్తాను".
'ఎందుకు లెండి మీకు శ్రమ. పైగా మీ ముందు నేను జుట్టు కత్తిరించుకోవాలి అంటే నాకు సిగ్గు కూడా'.
"నా దగ్గర సిగ్గెందుకు సరోజిని? నిజం చెప్పాలంటే నీ జుట్టు కత్తిరిస్తున్నప్పుడు చూడాలని ఉంది".
'పో కుమార్ మరీను ఇంకా నయం నేను గుండు చేయించుకుంటే ఉన్నప్పుడు చూడాలని ఉంది అని అనలేదు.'.
"ఆ మాట నిజమే సరోజిని. ఆ రోజు నువ్వు నన్ను టెంపుల్ లోకి నీతో పాటు లోపలికి రమ్మని అని ఉంటే ఎంత బాగుంటుందో అని చాలాసార్లు అనుకున్నాను కానీ నువ్వు నన్ను పిలవకుండా నువ్వు ఒక్కదానివే వెళ్లి గుండు చేయించుకున్నావు. నేను మంచి ఛాన్స్ మిస్ అయిపోయాను అని బాధపడ్డాను" అని సరోజిని టీజ్ చేశాను.
"పో కుమార్ మాటమాటికీ ఆ గుండు సంగతి ఎత్తమాక నాకు చచ్చేంత సిగ్గుగా అనిపిస్తుంది."
'సరే లే రేపు రెడీగా ఉండు నేను వచ్చి నిన్ను హెయిర్ కట్ కి తీసుకుని వెళ్తాను'
"హమ్మయ్య ఇప్పుడు నా గుండె మీద బరువు తగ్గినట్లు అనిపించింది".
'నీకు తగ్గింది ఇప్పుడు నా గుండె పైన బరువు అనిపిస్తుంది'
"ఎందుకు అలా కుమార్?"
'ఒకవేళ నువ్వు హెయిర్ కట్ చేయించుకున్న తర్వాత నిన్ను గానీ మా అమ్మ చూసింది అనుకో నన్ను పచ్చడి చేసేస్తుంది'.
"నేను కనపడకుండా జాగ్రత్త పడతాను లే".
నేను నెక్స్ట్ డే సరోజినీ ఇంటికి వెళ్లి తనను హెయిర్ కటింగ్ తీసుకుని వెళ్దామని వెళ్లాను. అప్పటికే సరోజిని రెడీ అయిపోయి ఉంది.
ఏంటో కాబోయే భార్యని హెయిర్ కట్ చేయించడానికి సెలూన్ కి తీసుకు వెళుతుంటే నాకు ఏదో లాగా అనిపించింది.
సరోజిని జుట్టు అంతటిని చక్కగా దువ్వుకుని ఒక హెయిర్ క్లిప్ పెట్టుకుని ఉంది.
ఇద్దరం కలిసి సిటీలో ఉన్న ఒక పెద్ద ఫేమస్ హెయిర్ సెలూన్ కి వెళ్తుండగా మధ్యలో అడిగాను.
"సరోజినీ పి ఏ పోస్ట్ అన్నావు కదా ఏ రకమైన హెయిర్ కట్ చేయించుకోవాలో తెలుసా నీకు?" 'నాకేమీ ఐడియా లేదండి వాళ్లకి చెపితే వాళ్లే ఒక హెయిర్ కట్ ని సజెస్ట్ చేసి చేస్తారు.'
అది సిటీలో చాలా పెద్ద సెలూన్. మేము వెళ్ళేటప్పటికి అది చాలా ఖాళీగా ఉంది కస్టమర్స్ ఎవరు లేరు.
మేము లోపలికి వెళ్లి రిసెప్షనిస్ట్ తో సరోజిని ని చూపిస్తూ "తనకి హెయిర్ కట్ చేయాలి" అని అడిగాను.
ఆవిడ నవ్వుతూ ఒక వైపు చూపించింది. అక్కడ ఒక మేల్ హెయిర్ డ్రెస్సర్ వున్నాడు. హెయిర్ డ్రెస్సర్ మమ్మల్ని చూసి 'రండి' అని నవ్వాడు. మేము అతని దగ్గరకు వెళ్లగానే 'చెప్పండి సార్ ఏం చేయాలి?' అని అడిగాడు.
"ఈవిడ పేరు సరోజినీ నా కాబోయే భార్య. ఒక పెద్ద ప్రైవేట్ కంపెనీలో పిఎ గా చేస్తోంది. ప్రమోషన్ వచ్చింది తన పిఎ పోస్ట్ కి అనుగుణంగా మోడ్రన్ గా తయారు చేయాలండి".
'అలాగా సరే సరే... రండి కూర్చోండి' అని బార్బర్ చైర్ చూపించాడు.
సరోజినీ కొంచెం సిగ్గుపడుతూ నావైపు చూసి నెమ్మదిగా బార్బర్ జరిగింది కూర్చుంది.
No comments:
Post a Comment