పొడుగు జడ నుండి గుండు కి మారిన ఉష
పక్కింటి పిన్ని గారి తో పిచ్చాపాటీ మాట్లాడుతూ తన పొడుగాటి జడను ముందుకు వేసుకుంది ఉష.
"ఉషా నీ జడ చాలా బాగుంది ఈ రోజుల్లో కూడా నువ్వు జడ ని చాలా బాగా మెయింటైన్ చేస్తున్నావ్.
ఈ రోజుల్లో ఇంత పొడుగాటి జడ ని చూసి చాలా రోజులైంది. ఏ ఆడపిల్ల ని చూసినా బెత్తెడు జుట్టే."
ఆవిడ అలా అంటుంటే చాలా పొంగిపోయి
ముసి ముసి నవ్వులు నవ్వుతూ
"అన్నట్టు మర్చిపోయాను పిన్ని గారు రేపు నేను మన గుడి జాతర కి వెళ్తున్నాను. మొక్కు తీర్చుకుందామని" ఎప్పటినుండో అనుకుంటున్నాను కానీ అవ్వడం లేదు. ఆయనకూడా ఎలాగు ఊరిలో లేరు. నేను వెళ్ళి తీర్చేసి వచ్చేద్దామని అనుకుంటున్నాను".
"ఏమి మొక్కు ఉషా?"
"ఏమీ లేదు పిన్ని గారు జాతరలో మూడు కత్తెర్లు ఇస్తానని మొక్కుకున్నాను." అంటూ జడ చివర్లో కొంత భాగాన్ని చూపించింది.
"జాగ్రత్త ఉషా అక్కడి మంగలి వాళ్ళు చాలా చురుగ్గా, హుషారుగా, పొగరుగా ఉంటారు. జుట్టు ని కొంచెం గా కత్తిరించమని అన్నా కూడా చాలా ఎక్కువగా కత్తిరించేస్తారు. మన మాటల్ని అస్సలు పట్టించుకోరు. చాలామందికి అలాగే కత్తిరించేశారు. రెండంగుళాలు కత్తిరించమని అంటే పది అంగుళాలు కత్తిరిస్తారు. మొన్ననే మా చుట్టాల లో ఒక ఆవిడకి, నీలాగే నడుము వరకు జడ ఉండేది. మూడు అంగుళాలు, మూడు కత్తెర్లు అని కత్తిరించమని చెబితే మెడ వరకు జుట్టుని కత్తిరించేశారు"
"అలాంటిదేమీ ఉండదు పిన్నిగారు ఆవిడే కావాలని కత్తిరించమని అని అడిగి ఉంటుంది అందుకే కత్తిరించి ఉంటారు. ఊరికినే వాళ్లు మాత్రం ఎందుకు కత్తిరిస్తారు"
"ఏది ఏమైనా ఉష.... నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు వాళ్ళు నీ జుట్టును కత్తిరిస్తున్నప్పుడు చూసుకుంటూ ఉంటు."
"అలాగే పిన్ని గారు".
రెండు రోజుల తర్వాత....
" ఉష ఏం చేస్తున్నావు? జాతరకి వెళ్లి మొక్కు తీర్చుకొని వచ్చావా?" అంటూ లోపలికి వచ్చింది పక్కింటి ఆవిడ.
"ఆ రండి పిన్ని గారు" అంటూ లోపలికి పిలిచింది ఉష.
ఉష తలనిండా కొంగుని కప్పుకుని ఉండటాన్ని చూసి కొంచెం ఆశ్చర్యపోయి
"ఏంటమ్మా నీ మొక్కు మూడు కత్తెర్లు అని అన్నావుగా...మరి ఏంటి ఇలా గుండు చేయించుకొని వచ్చావు.?"
"మీరు చెప్పింది నిజమే పిన్ని గారు. మీరు ఎంత చెప్పినా నేను పట్టించుకోలేదు. అక్కడి మంగలి వాళ్ళు చాలా దురుసుగా ఉన్నారు".
"అసలు ఏం జరిగింది? కొంచెం వివరంగా చెప్పు"
"అసలు నేను నా జడ చివరన మూడు అంగుళాలు జుట్టు ని చూపించి మూడు కత్తెర్లు అని చెప్పాను.
మంగలి వాడు ఏదో అర్థమైనట్టు తల ఊపి కూర్చోమన్నాడు. నేను ముందు వైపుకి తిరిగి కూర్చుంటే మంగలి వాడు నా జడ ని పూర్తిగా విప్పి జుట్టు చివర నుండి పైకి నాలుగు అంగుళాలు కసక్ కసక్ మంటూ ఒకేసారి కత్తిరించేశాడు. నేను ఇంటి వైపు తిరిగి ఉండటం వల్ల మంగలి వాడు ఎంత కత్తిరించాడో నాకు తెలియలేదు అట్లా రెండవసారి నా జుట్టు ని పై నుండి కింది వరకు చేతులతో దువ్వి జుట్టు చివర్ల నుండి పై వరకూ ఇంకొక నాలుగు అంగుళాలు కత్తెరతో కసక్ కసక్ మంటూ కత్తిరించే చేసాడు. మరలా నా జుట్టు ని మొదటి నుండి చివరి వరకు చేతులతో దువ్వి నా జుట్టు చివర నుండి పైవరకు ఇంకొక నాలుగు అంగుళాలు కత్తెరతో కసక్ మంటూ ఒకేసారి కత్తిరించేసి...
"అమ్మ మూడు కత్తెర్లు తీశాను... చివర్లు లెవెల్ గా కత్తిరించమంటారా?" అని అడిగేసరికి
నేను నా రెండు చేతులు వెనక్కి పెట్టి జుట్టు ని పట్టుకుని చూసేసరికి నా నడుము కింద వరకు ఉండే నా జుట్టు ఇంచుమించు నా మెడపై వరకు అడ్డదిడ్డంగా కత్తిరించేసి ఉంది. కనీసం రబ్బర్ బ్యాండ్ పెట్టుకుందాం అన్నా కుదరదేమో అన్నంతగా కత్తిరించి పడేసాడు. ఆ సమయంలో నాకు ఏడుపు ఒక్కటే తక్కువ అయింది. ఎలాగూ అంత జుట్టు పోయింది కదా ఈ కొంచెం జుట్టు కూడా ఎందుకు అని 'గుండు చేసేయ్' అన్నాను.
నేను అలా అనేసరికి మంగలి వాడిలో ఎక్కడలేని హుషారు వచ్చి నీళ్లతో నా జుట్టును తడిపి మసాజ్ చేసి మంగలి కత్తిని తీసుకుని పర పర అంటూ నున్నగా గీసి పడేసాడు" అంటూ ఏడుస్తూ చెప్పింది ఉష.
"అందుకే ఉషా నేను ముందుగా చెప్పాను. వాళ్లు నీ జుట్టు ని కత్తిరిస్తున్నప్పుడు చూసుకోమన్నాను. అనవసరంగా వెళ్లి గుండు గీయించుకుని వచ్చావు."
అంటూ ఉష గుండు మీద చెయ్యి వేసి రుద్దుతూ...
"అబ్బా చాలా నున్నగా గీసాడే గుండు"
"అవును పిన్ని గారు రెండు మూడుసార్లు గీసి నున్నగా వచ్చేటట్టు చేశాడు."
"పోనీలే ఉష బాధపడకు. అంత జుట్టు రావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అయినా నువ్వు గుండు లో కూడా చాలా అందంగా ఉన్నావు."
అంటూ వెళ్ళిపోయింది పక్కింటి ఆవిడ.
ఆవిడ అన్న మాటలకి రెండు చేతులను గుండుపై వేసుకొని రుద్దుకుంటూ వెళ్లి అద్దం ముందు నిలబడి చూసుకుంటే తన నున్నటి గుండు చాలా అందంగా కనిపించింది ఉష కి.
ఆ రాత్రికి ఆఫీస్ టూర్ నుండి ఇంటికి వస్తున్న ఆయనకి తన గుండు గురించి ఎలా సర్ది చెప్పాలో ఆలోచిస్తూ వుండిపోయింది
No comments:
Post a Comment