Monday, September 6, 2021

Andam chandam haircut live program

 అందం చందం హెయిర్ కట్ లైవ్ ప్రోగ్రాం

"చూశారుగా ఈరోజు హెయిర్ కట్ లైవ్ ప్రోగ్రాం ఎప్పటికప్పుడు లేటెస్ట్ హెయిర్ కట్స్ మీకు అందించడంలో ఈ మానస ఎప్పుడూ మీ ముందు ఉంటుంది. మీరు చూపిస్తున్న అభిమానానికి, ఈ లైవ్ ప్రోగ్రాం కి ఇండియాలో హైయెస్ట్ రేటింగ్ వచ్చింది. నెక్స్ట్ వీక్ మనం అందం చందం లైవ్ హెయిర్ కట్ ప్రోగ్రాంలో ఒక బ్యూటిఫుల్ మోడల్ పొడుగాటి జుట్టు ని షార్ట్ బాబ్ కట్ చేయించుకోవడానికి సిద్ధంగా ఉంది. మీ అందరూ నెక్స్ట్ వీక్ ఈ ప్రోగ్రాం కి రెడీగా ఉండండి. మీ మానస.. చూస్తూ ఉండండి మీ అందం చందం హెయిర్ కట్ లైవ్ ప్రోగ్రాం. టిల్ దెన్ బైబై అంటూ" అందం చందం హెయిర్ కట్ లైవ్ ప్రోగ్రాం ని పూర్తి చేసింది మానస.
మనం కథలోకి వెళ్ళబోయే ముందర మానస గురించి తెలుసుకుందాం.
మానస చాలా అందమైన అమ్మాయి. మంచి కలర్ మంచి హైట్. ఇక జుట్టు విషయానికి వస్తే, అందమైన ఒత్తైన పొడవైన జుట్టు. గత రెండు సంవత్సరాల నుండి 'మనందరి టీవీ' లో పనిచేస్తూ మంచి పేరు సంపాదించుకుంది. ఈ రెండు సంవత్సరాలలో అంచలంచలుగా ఎదుగుతూ ఇండివిడ్యువల్ గా ప్రోగ్రాం కండక్ట్ చేసే స్థాయికి ఎదిగింది. మనందరి టీవీ ఛానల్ డైరెక్టర్ హార్డ్ వర్క్ చేసే వాళ్లని నెత్తిమీద పెట్టుకుంటాడు. అందుకే మానస హార్డ్ వర్క్ ని గుర్తించి జీతం బాగా పెంచి అందం చందం హెయిర్ కట్ అనే లైవ్ ప్రోగ్రామ్ ని ఇండివిడ్యువల్ గా కండక్ట్ చేయడానికి ఒప్పుకున్నాడు. అతను ఎంతో మంచి వాడు అంత చండశాసనుడు కూడా. చెప్పిన పనిని చెప్పిన టైంలో చెయ్యకపోయినా, పని ఏ మాత్రం ఆలస్యం అయినా, పని విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నా, చానల్ కి చెడ్డపేరు వచ్చే విధంగా చేసినా, వాళ్లకి రెండో ఛాన్స్ ఇవ్వకుండా ఇమీడియట్గా ఉద్యోగం నుండి డిస్మిస్ చేసేస్తాడు. అందుకే ఎంప్లాయిస్ అందరూ ఎలర్ట్ గా ఉండి ఏ పొరపాట్లు చేయకుండా పెర్ఫెక్ట్ గా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మానస ఈ అందం చందం హెయిర్ కట్ లైవ్ ప్రోగ్రాం ని స్టార్ట్ చేసి రెండు నెలలు అయింది. వారానికి ఒకటి చొప్పున ఇప్పటికీ ఎనిమిది ఎపిసోడ్స్ ని సక్సెస్ ఫుల్ గా చేసింది. దాంతో చానల్ రేటింగ్ తారాజువ్వలా గా ఆకాశంలోకి దూసుకుపోయింది. అప్పుడు వెంటనే డైరెక్టర్ మీటింగ్ కండెక్ట్ చేసి మానస కు సర్ప్రైస్ బోనస్ కింద 50,000 ప్రకటించాడు. సంస్థలో ఎవరైనా ఇలా పని చేస్తే ఇలాగే బోనస్లు ఇంక్రిమెంట్లు ఇస్తూ ఉంటాడు.
మానస అందాన్ని, పొడుగాటి జడ ని చూసి ముచ్చటపడి తల్లిదండ్రులతో చెప్పి ఈ మధ్యనే పెళ్లి చేసుకున్నాడు రవి. ఇద్దరికీ పెళ్లి అయ్యి నాలుగు నెలలు అయింది. రవికి కొంచెం హెయిర్ ఫెటిష్ ఉంది. ఎక్కడైనా ఎవరైనా అందమైన పొడుగాటి జుట్టుతో కనిపిస్తే చాలు, వాళ్ళని చూస్తూ ఆ అందమైన జుట్టు ని చూస్తూ ఆనందం పొందుతూ ఉంటాడు. రాత్రి అయితే చాలు మానస జుట్టుతో ఆడుకోకుండా ఉండలేడు. మొదట్లో మానస ఏదో అనుకుంది గాని, ఇప్పుడిప్పుడే రవి తన జుట్టుతో ఆడుకుంటూ ఉంటే ఏదో తెలియని ఆనందాన్ని రుచి చూస్తోంది. ఎప్పుడు జుట్టుని విరబోసుకొని ఉండే మానస బెడ్ రూమ్ లోకి వెళ్లబోయే ముందర కావాలని జడ వేసుకొని వెళ్ళేది. అలా మానస జడ వేసుకుని బెడ్ రూమ్ లోకి వెళ్ళగానే రవి మానస జడను అందుకుని జడని లాగుతూ విప్పుతూ ఉంటే మానస ఏదో తెలియని ఆనందాన్ని సుఖాన్ని పొందుతున్నట్లు ఫీల్ అవుతుంది. ఇన్నేళ్లు టీవీ ఛానల్ లో పని చేస్తూ కూడా మానస ఎప్పుడూ తన జుట్టుని కత్తిరించు కోలేదు. ఎందుకంటే తన పొడుగాటి జుట్టు అంటే తనకు చాలా ఇష్టం. తనకి మేకప్ చేసేటప్పుడు ఎంతో మంది హెయిర్ స్టైలిస్ట్ లు ఈ హెయిర్ కట్ చేయించుకోండి ఆ హెయిర్ కట్ చేయించుకోండి చాలా బాగుంటుంది మీ ఫేస్ కి అని ఎంత బలవంత పెట్టినా మానస అసలు కత్తెర ని తన జుట్టు మీద పెట్టడానికి ఒప్పుకోలేదు. రవి కి తన పొడుగాటి జుట్టు అంటే చాలా ఇష్టం అని తెలిసిన మానస బెడ్ రూమ్ లో రవి తన జుట్టుతో ఆడుకుంటూ మంచి మూడ్లో ఉండగా కావాలని "ఏమండీ... నాకు ఈ లాంగ్ హెయిర్ బోర్ కొట్టేసింది అండి. ఇంత పెద్ద జుట్టు చాలా చిరాగ్గా ఉంది. రేపు పార్లర్కి వెళ్లి పొట్టిగా కత్తిరించి షార్ట్ బాబ్ కట్ చేయిద్దామని అనుకుంటున్నాను" అని అనగానే
రవి బుంగమూతి పెట్టి "ప్లీజ్ నీ జుట్టుని కత్తిరించొద్దు" అని తెగ బతిమిలాడుతుంటే మానస లోలోపల నవ్వుకుంటూ ఉండేది.
ఇంకా కావాలని "లేదండి నా హెయిర్ కట్ కి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాను రేపు వెళ్లి షార్ట్ గా కత్తిరించేసుకుంటాను" అని అనగానే రవి ఇంకా గట్టిగా తన జుట్టుని పట్టుకుని నలిపేస్తూ ముద్దులు పెడుతూ జుట్టుని కత్తిరించొద్దని బుజ్జగిస్తూ ఉంటే మానస లోలోపల ఆనందిస్తూ ఉండేది.
ఇప్పుడు అసలు కథలోకి వస్తే...
రేపు ప్రసారమయ్యే లైవ్ హెయిర్ కట్ ప్రోగ్రాం లో హెయిర్ మోడల్ గా పార్టిసిపేట్ చేయడానికి ఉత్సాహం చూపించిన దివ్య కు కాల్ చేసి 'హాయ్ దివ్య నేను మానస ని 'మనందరి టీవీ' నుండి. రేపు లైవ్ హెయిర్ కట్ ప్రోగ్రాం కి నువ్వు రెడీనా?'
'ఎస్ మేడం. నాకైతే చాలా ఎక్సైటింగ్ గా ఉంది మేడం టీవీ లో కనిపిస్తున్నందుకు. నేను ఎన్ని గంటలకు ఎక్కడికి రావాలి మేడం?'
'గుడ్ దివ్య. మన లైవ్ హెయిర్ కట్ ప్రోగ్రాం 11 కి స్టార్ట్ అవుతుంది. కాబట్టి నువ్వు పదిన్నరకల్లా ఇందిరా నగర్ లో ఉన్న ఫ్యామిలీస్ సెలూన్ కి వచ్చేసేయ్. లేట్ చెయ్యద్దు అక్కడ నేను వెయిట్ చేస్తూ ఉంటాను'
'అలాగే మేడం తప్పకుండా పదిన్నరకల్లా అక్కడ ఉంటాను'
'ఓకే బాయ్ బాయ్ దివ్య రేపు కలుద్దాం' అంటూ ఫోన్ పెట్టేసింది మానస.
ఆ రోజు రాత్రి కూడా యధావిధిగా మానస బెడ్రూంలోకి వెళ్లబోయే ముందర విరబోసిన జుట్టుని జడలాగా అల్లుకుని నాలుగు మూరల మల్లె పూలు పెట్టుకొని రవి పక్కన చేరింది.
వెంటనే రవి ఆలస్యం చేయకుండా మానస తలని దగ్గరికి తీసుకొని తల లోని మల్లెపూల వాసనని పీలుస్తూ తమకంగా జుట్టు ని నలిపేస్తూ జడని విప్ప సాగాడు అలా జుట్టు ని విరబోసి నలిపేస్తూ మానస ని దగ్గరికి తీసుకుని ఆక్రమించుకుంటూ మగతగా 'ప్లీజ్ మానస నీ జుట్టుని కత్తిరించవద్దు... ప్లీజ్' అంటూ పూర్తిగా ఆక్రమించుకున్నాడు. మానస కూడా రవి కి ఇంకా దగ్గర అయ్యి నలిగిపోతూ తన మూలుగులతో రవి ని రెచ్చగొట్టసాగింది.
ఈ కార్యక్రమం అంతా అయ్యి ఇద్దరూ అలసి సొలసి పక్కపక్కన పడుకొని ఉండగా
"ఏవండీ రేపు మా ఛానల్ లో హెయిర్ కట్ లైవ్ ప్రోగ్రాం లో పార్టిసిపేట్ చేసే అమ్మాయికి నాకంటే పొడుగైన అందమైన జుట్టు ఉంది తెలుసా రేపు లైవ్ హెయిర్ కట్ ప్రోగ్రాం లో ఆ అమ్మాయి తన పొడుగాటి జుట్టు ని షార్ట్ బాబ్ కట్ చేయించుకుంటుంది. నేను చేయించుకుంటాను అంటే మీరు ఒప్పుకోవట్లేదు. ఒక్కసారి చేయించుకుంటా నండి' అంటూ రవిని ఉడికించింది.
"అమ్మ మానస తల్లి నీకు దండం పెడతాను. దయచేసి నీ అందమైన పొడుగాటి జుట్టు కత్తిరించుకొని పాడు చేయొద్దు" అని రవి కాళ్లావేళ్లా పడుతుంటే మానస కు నవ్వాపుకోలేక చచ్చినంత పని అయింది.
నెక్స్ట్ ది పొద్దున్నే మానస తలారా స్నానం చేసి జుట్టుని ఆరబెట్టుకుని చిక్కులు లేకుండా దువ్వుకుని జుట్టుని లూజుగా వదిలేసి అందంగా తయారై ఫ్యామిలీస్ సెలూన్ కి వెళ్ళింది. ఆ సెలూన్లో లైవ్ షూటింగ్ ఉండటం వల్ల మిగతా కస్టమర్స్ కి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మానస అక్కడ లైవ్ పోగ్రామ్ కి, టెలికాస్ట్ చేయడానికి అంతా రెడీగా ఉందో లేదోనని టెస్ట్ చేసుకునేటప్పటికి టైం పది అయింది. దివ్య బయలుదేరిందా లేదో ఒక సారి చూద్దామని దివ్యకి కాల్ చేసింది. ఫోన్ రింగ్ అవుతుంది కానీ దివ్య ఎత్తటం లేదు. ఒక ఐదు నిమిషాలు ఆగి మళ్ళా ఫోన్ చేసింది మానస. మళ్లీ నో రెస్పాన్స్. అప్పటికి టైం 10:40 అయింది. ఒక పది సార్లు కంటిన్యూగా ట్రై చేసేసరికి ఎవరో ఒక ఆవిడ ఎత్తి 'హలో ఎవరు అంది'
మానస దివ్య గురించి అడిగే టప్పటికి ఆవిడ దివ్య ఊర్లో లేదమ్మా ముంబై వెళ్ళింది ఈరోజు తెల్లవారుజామున ఫ్లైట్లో వెళ్ళింది. తన క్లోజ్ ఫ్రెండ్ హాస్పిటల్లో ఐసీయూలో ఉందంట అందుకని వెళ్ళింది' అని చెప్పి ఫోన్ కట్ చేసింది. మళ్లీ మానస ఎన్ని సార్లు ట్రై చేసినా ఫోన్ ఎత్తలేదు.
అప్పటికి టైం 10:50 అయింది
మానస లో టెన్షన్ పెరిగిపోతుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. పోనీ డైరెక్టర్ కి ఫోన్ చేసి ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది అని చెబుదామా అంటే
బండ బూతులు తిట్టి ఇంక ఆఫీసుకి రావక్కర్లేదని అంటాడు.
మానస కి ముచ్చెమటలు పట్టి ఏం చేయాలో అర్థం కాకుండా అలా కూర్చుని ఉంటుంది.
అప్పుడు హెయిర్ స్టైలిస్ట్ మానస దగ్గరకు వచ్చి
"మేడం టైం అవుతుంది మన మోడల్ ఎక్కడ?" అని ఆత్రంగా అడుగుతాడు.
"మన మోడల్ రావడం లేదండి అందుకే నాకు టెన్షన్ గా ఉంది ఏం చేయాలో అర్థం కావడంలేదు"
"అలా అయితే పోగ్రామ్ క్యాన్సిల్ చేద్దామా అండి"
"నో పోగ్రామ్ క్యాన్సిల్ చేయడానికి వీలులేదు ఆరు నూరైనా సరే లైవ్ ప్రోగ్రాం టెలికాస్ట్ అవ్వాల్సిందే"
"మేడం హెయిర్ కటింగ్ మోడల్ లేకపోతే ఎలా చేసేది? ఎవరికి చేయాలి హెయిర్ కట్? అయినా ఇప్పటికి ఇప్పుడు లాంగ్ హెయిర్ ఉన్న అమ్మాయి ఎలా దొరుకుతుంది మనకి?"
అప్పుడు మానసకి ఎదురుగా ఉన్న పెద్ద అద్దంలో తను ముందుకి వేసుకున్న జుట్టు కనిపిస్తుంది.
వెంటనే వేరే ఆలోచన లేకుండా హెయిర్ కట్ కి మోడల్ రెడీ. మీరు హెయిర్ కట్ స్టార్ట్ చేయండి మీరు వీడియో షూటింగ్ స్టార్ట్ చేయండి అని అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. అందరూ హెయిర్ కట్ మోడల్ ఎక్కడ అని వెతుకుతూ ఉండగా.. మానస నెమ్మదిగా లేచి వెళ్లి బార్బర్ చైర్ దగ్గర నిలబడి ఉంటుంది. తనకి అప్పుడు ఏ ఆలోచనలు లేవు. తన పొడుగాటి అందమైన జుట్టుని కత్తిరించుకుంటే రవి ఏమంటాడో అనే ఆలోచనలు కూడా లేవు. తను ఎంతగానో ప్రేమించే అందమైన జుట్టుని త్యాగం చేయడానికి సిద్ధపడింది మానస.
దుఃఖాన్ని దిగమింగి కొని, లేని నవ్వు ని మొహం పై పులుముకొని
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టూ మన అందరి టీవీ, మానస సమర్పిస్తున్న అందం చందం లైవ్ హెయిర్ కట్ ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈరోజు మన లైవ్ హెయిర్ కట్ ప్రోగ్రాంలో వెరీ లాంగ్ హెయిర్ ని షార్ట్ బాబ్ కట్ ఎలా చేయాలో తెలుసుకుందాం. అంటూ తన పొడుగాటి జుట్టుని ముందుకి వేసుకొని పైకి ఎత్తుతూ కెమెరాకి చూపిస్తుంది మానస.
అలా కొంత సేపు తన జుట్టుని అన్ని యాంగిల్స్ లో కెమెరా కి చూపించి నెమ్మదిగా వెళ్లి బార్బర్ చైర్ ఎక్కి కూర్చుంటుంది మానస.
హెయిర్ స్టైలిస్ట్ నవ్వుతూ మానస జుట్టుని ఒకసారి కెలికి జుట్టంతా మెలి తిప్పి పైకి కొప్పు లాగా పెట్టి హెయిర్ క్లిప్ పెట్టాడు. పక్కన ఉన్న వైట్ క్లాత్ ని తీసుకుని మానస మీద కప్పి, కొప్పు కు పెట్టిన క్లిప్ ని తీసి జుట్టు ని మంచిగా దువ్వి మెడ మీద జుట్టు ని వేరు చేసి మిగతా పై జుట్టు నంతటినీ పైకి మడిచి కొప్పు లాగా పెడతాడు. మానస తలను ముందుకు వంచి పక్కన ఉన్న వాటర్ స్ప్రే ని తీసుకొని మెడ పైన జుట్టు మీద నీళ్ళు చల్లి, దువ్వెన కత్తెర ని తీసుకొని కత్తెర ని కచకచ మంటూ ఆడిస్తూ శబ్దం చేస్తాడు.
మానస తల ఎత్తి కెమెరా వైపు చూస్తూ ఉండగా హెయిర్ స్టైలిస్ట్ రెండు చేతులతో మానస తలను గట్టిగా పట్టుకొని బాగా ముందుకి కిందకి వంచి దువ్వెన ని జుట్టులోకి పోనిచ్చి పైకి ఎత్తి కత్తెరతో ఆడిస్తూ కత్తిరించడం మొదలుపెడతాడు. కత్తెర కసక్ కసక్ కసక్ కసక్ మంటూ మానస జుట్టుని కత్తిరిస్తూ ఉంటుంది.
నేప్ దగ్గర జుట్టు నంతటిని కత్తిరించిన తరువాత హెయిర్ స్టైలిస్ట్ క్లిప్పర్ ని తీసుకుని నేప్ ని షేవ్ చేయడం మొదలుపెడతాడు. అలా షేవ్ చేసి తల పై పెట్టిన కొప్పు ని విప్పి జుట్టు పైన వాటర్ ని స్ప్రే చేసి జుట్టు మొత్తాన్ని బాగా తడిపి దువ్వెనతో బాగా దువ్వి మధ్య పాపిడి తీసి జుట్టు ని 3 భాగాలుగా చేసి క్లిప్పులు పెడతాడు. మానస తలను ముందు వైపు కిందకి బాగా వంచి తల వెనుక వైపు జుట్టుని మెడ వరకు కత్తెరతో సమంగా కత్తిరిస్తాడు. అలా కత్తిరిస్తున్న ప్పుడు మానస కు మాత్రం కసక్ కసక్ కసక్ కసక్ మంటూ శబ్దం మాత్రం వినిపిస్తుంది. మానస తల నుండి వేరైన పొడుగాటి జుట్టు మానస భుజాల మీద నుండి కిందకు వేలాడుతూ నిర్జీవంగా కనిపిస్తుంది. హెయిర్ స్టైలిస్ట్ ఆ జుట్టు ని నెమ్మదిగా తీసి కింద పడేస్తాడు. అప్పటివరకు మానస మెడ అంతా నల్లటి ఒత్తయిన పొడుగాటి జుట్టు లో దాక్కొని ఉండేది. ఇప్పుడు ఆ మెడ అంతా నల్లటి మబ్బుల్లోంచి చంద్రుడు బయటకు వచ్చి ప్రకాశించి నట్టు మిల మిలా మెరిసి పోతూ కనిపిస్తోంది. ఇప్పుడు హెయిర్ స్టైలిస్ట్ మానస తలను పైకి ఎత్తి కుడి వైపు వచ్చి మానస తలను ఎడమ వైపుకు వంచి జుట్టు ని బాగా దువ్వి కత్తెరను బుగ్గలపై పెట్టి నెమ్మదిగా కత్తిరించడం మొదలుపెడతాడు.
అలా కత్తెరను కసక్ కసక్ మంటూ ఆడిస్తూ చెవుల వరకు కత్తిరిస్తాడు. అప్పుడు ప్రాణప్రదంగా చూసుకుంటున్న అందమైన పొడుగాటి తన జుట్టు తన తల నుండి వేరయు తన ఒడిలో జారిపోయి పడిపోతూ ఉంటుంది. ఎదురుగా అద్దం లో అది చూసిన మానసకి. వస్తున్న ఏడుపుని ఆపుకోవడం చాలా కష్టం అయింది. అప్పుడు హెయిర్ స్టైలిస్ట్ కుడి వైపు జుట్టుని వెనకవైపు జుట్టుతో లెవెల్ గా కత్తిరించి మానస ఎడమవైపుకి వస్తాడు.
అప్పుడు మానస అద్దం లో చూసుకునేసరికి ఒకవైపు జుట్టు పొట్టిగా గడ్డం వరకు ఉండి ఇంకొక వైపు జుట్టు పొడుగ్గా ఉండి కిందకు వేలాడుతూ ఉంది. జుట్టు ని అలా చూసేసరికి చాలా బాధ అనిపించి "నేను ఇంతవరకు ఎంతోమంది ఆడవాళ్లను ఇదే బార్బర్ చైర్ మీద కూర్చోబెట్టి దగ్గరుండి హెయిర్ కట్ చేయించాను. కొంతమంది వద్దంటున్నా వాళ్ల పొడుగు జుట్టు కత్తిరించి షార్ట్ హెయిర్ కట్స్ చేయించాను. నేను కలలో కూడా అనుకోలేదు అదే బార్బర్ చైర్ లో నేను కూర్చుని అందమైన పొడుగాటి జుట్టు కత్తిరించు కుంటానని" ఇలా ఆలోచిస్తుండగా, హెయిర్ స్టైలిస్ట్ మానస హెయిర్ కట్ కంప్లీట్ చేసేసాడు. తిరిగి మానస అద్దంలో చూసుకునే సరికి స్కూలుకి వెళ్లే పిల్లలకు చేసినట్టు షార్ట్ బాబ్ కట్ చేసి ఉంది. వెంటనే మానస బార్బర్ కుర్చీలోంచి దిగి కెమెరా వైపు చూస్తూ "హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉంది ఈ హెయిర్ కట్ మీకు నచ్చితే మీరు కూడా వచ్చి చేయించుకోండి. అందం చందం లైవ్ హెయిర్ కట్ ప్రోగ్రాం చూసి ఎంజాయ్ చేశారు కదా. మరల వచ్చేవారం కలుద్దాం. అంతవరకు సెలవు ఇట్లు మీ మానస". అంటూ హెయిర్ కట్ లైవ్ ప్రోగ్రామ్ అని కంప్లైంట్ చేసింది. హలో మానస ప్రోగ్రామ్ని ముగిస్తున్నప్పుడు కెమెరా ని బార్బర్ చైర్ కింద చుట్టూ పడి ఉన్న మానస అందమైన జుట్టు ని, లేటెస్ట్ హెయిర్ కట్ తో ఉన్న మానస మొహాన్ని మార్చి మార్చి చూపించాడు కెమెరామన్. మానస కూడా బార్బర్ చైర్ కిందన నిర్జీవంగా, చిందరవందరగా, కత్తిరించిన తన జుట్టు పడి ఉండటాన్ని చూసి బాధతో ఇంటికి బయలుదేరింది. అప్పటికే ఇంటికి వచ్చి ఉన్న రవి, మానస కొత్త హెయిర్ కటింగ్ చూసి కోపంతో ఏదో అనబోయే లోపల, అప్పటివరకు కంట్రోల్ చేసుకున్న దుఃఖాన్ని ఇక ఆపుకోలేక రవి ని గట్టిగా కౌగిలించుకొని బోరున ఏడుస్తూ "ఏవండీ నాకు ఇష్టం లేకపోయినా అనుకోకుండా నా జుట్టు నంతటినీ పొట్టిగా కత్తిరించుకున్నాను అండి" అంటూ జరిగిన కథంతా చెప్పింది.

No comments:

Post a Comment

Temple of vows

The Temple of Vows The Shree Vithala Mandir stood majestic against the amber sky, its stone spires piercing the horizon. Meera led the way, ...